»Minister Amarnath Fires On Janasena Chief Pawan Kalyan
Pawanది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన: మంత్రి అమర్నాథ్
Minister amarnath fires on pawan kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) మంత్రి గుడివాడ అమర్ నాథ్ ( amarnath) ఫైరయ్యారు. చంద్రబాబు (chandrababu naidu) అజెండాను పవన్ (pawan) అమలు చేస్తారని విమర్శించారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఏ ఉపయోగం లేకుండా ఉన్న పార్టీ జనసేన పార్టీ ఒక్కటేనని అమర్ నాథ్ ( amarnath) విమర్శించారు.
Minister amarnath fires on janasena chief pawan kalyan
Minister amarnath fires on pawan kalyan:జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై (pawan kalyan) మంత్రి గుడివాడ అమర్ నాథ్ ( amarnath) ఫైరయ్యారు. చంద్రబాబు (chandrababu naidu) అజెండాను పవన్ (pawan) అమలు చేస్తారని విమర్శించారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఏ ఉపయోగం లేకుండా ఉన్న పార్టీ జనసేన పార్టీ ఒక్కటేనని అమర్ నాథ్ ( amarnath) విమర్శించారు. నెలన్నర నుంచి బంకర్లో ఉన్న వ్యక్తి బందర్‌కు వచ్చాడని పవన్ కల్యాణ్‌ను (pawan kalyan) ఉద్దేశించి కామెంట్ చేశారు. 2014లో ఒకరితో, 2019లో మరికొందరితో పొత్తులు పెట్టుకున్నాడని ఆరోపించారు. కుల ప్రస్తావన లేని సమాజం కోసం పార్టీ పెట్టానని చెప్పిన ఆయన.. కులాల గురించి ఎంతసేపు మాట్లాడాడో నిన్నటి సభలో చూశాం అని అమర్ నాథ్ ( amarnath) అన్నారు.
కాపులను చంద్రబాబు (chandrababu) వద్ద తాకట్టు పెట్టడమే మీ పని అయిపోయిందని విమర్శించారు. దత్తపుత్రుడనే పదానికి జస్టిఫికేషన్ నిన్నటి సభలో ఇచ్చారని మండిపడ్డారు. అసెంబ్లీకి రావడానికి ఎన్నికల వరకు ఎందుకు.. స్పీకర్‌ను (speaker) అడిగి తామే పాసులు ఇప్పిస్తామని సెటైర్స్ వేశారు. పవన్ కళ్యాణ్‌ది (pawan kalyan) కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన అని మండిపడ్డారు. చంద్రబాబుకు (chandrababu) అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చాడట. ఓ పత్రికలో వెయ్యి కోట్ల డీల్ గురించి రాస్తే అప్పుడెందుకు చెప్పుతీయలేదని అడిగారు.
సొంతమనుషులు అంటే మీకు ఓకే… తాము మాట్లాడితేనే కోపం వస్తుందా అని అడిగారు. నిన్నటి మాటలు విని కూడా పవన్ (pawan) అమ్ముడుపోలేదని ఎవరూ అనుకోరన్నారు. పవన్ (pawan) వ్యూహాలతో ఆ పార్టీ క్యాడరే అలసిపోయిందని అమర్ నాథ్ (amarnath) అన్నారు. చిరంజీవి (chiranjeevi) తమ్ముడివి కాదా? చిరంజీవి పెట్టిన పార్టీలో యువరాజ్యానికి అధ్యక్షుడివి కాదా అని అడిగారు. చిరంజీవి (chiranjeevi) పేరు చెప్పుకోవడానికి కూడా నామోషీగా ఫీలవుతున్నావా? అని ప్రశ్నించారు.