వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువై దేశానికే ‘తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC)’ మోడల్‌గా నిలిచిందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) అన్నారు.. టీఎస్ఆర్టీసీ ముందు 100 రోజుల గ్రాండ్ ఫెస్టివల్ (Festival) ఛాలెంజ్ ఉందని తెలిపారు. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్(Kalabhavan)లో శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్లతోపాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎండీ సజ్జనార్ ఉన్నతాధికారులతో కలిసి ఉత్తమ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. రాఖీ పౌర్ణమికి (Rakhi Full Moon) రికార్డు స్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేల్లోనూ ఇంత మొత్తంలో ఆదాయం రాలేదని తెలిపారు. నిజాయతీగా, నిబద్దతతో ఉత్తమ సేవలందించే అధికారులు, ఉద్యోగులే సంస్థకు నిజమైన బ్రాండ్ అంబాసిండర్లని పేర్కొన్నారు.