»Revanth Reddy Promised A Girl To Give Her Government Job
Revanth Reddy: సీఎం హోదాలో ఫస్ట్ జాబ్ నీకే ఇస్తాను తల్లి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఏ ఫైలుపై తొలిసారి సంతకం చేస్తాడనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Revanth Reddy said that KCR distributed 1000 crores in Telangana
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి ఏ ఫైలుపై తొలిసారి సంతకం చేస్తాడనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పార్టీ మొదటి నుంచి చెబుతున్న ఆరు హామీ పథకాల అమలు ఫైలుపై తొలి సంతకం చేయాలని నిర్ణయించారు. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మరుగుజ్జు అమ్మాయి రజనీకి తొలి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి తొలి హామీ ఇచ్చారు. ఇప్పుడు స్వయంగా రజనీకి ఉద్యోగం ఇస్తూ.. రేవంత్ సంతకం చేయబోతున్నారు. కాంగ్రెస్‌పై నమ్మకంతో రేవంత్‌రెడ్డితో తన సమస్యను చెప్పుకున్నానని రజినీ అన్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగం వస్తుందని అంటున్నారు. కానీ రేవంత్ సీఎం అయిన తర్వాత ఆయన ఇచ్చే తొలి ఉద్యోగం తనదేనని రజనీ సంతోషం వ్యక్తం చేశారు.
రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వికలాంగుడైన రజనీకి తొలి సంతకం చేయనున్నారు రేవంత్. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు ముందు అక్టోబరు 17న గాంధీభవన్‌లో రేవంత్‌ను రజనీ కలిశారని.. ఎంఏ చదివిన రజినీ.. ఉద్యోగం కోసం నానా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. తనను ఎవరూ ఆదుకోవడం లేదని ప్రైవేట్ కంపెనీలో కూడా ఉద్యోగం ఇప్పించడం లేదని రజినీ రేవంత్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా రజనీకి రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. రేపు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి హోదాలో రజనీ ఉద్యోగ నియామక ఫైలుపై కొత్త సీఎం రేవంత్ సంతకం చేయనున్నారు.