Tummala Nageswara Rao: పాలేరు టికెట్ దక్కకపోవడంతో మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటీవల నామా నాగేశ్వరరావు చర్చలు జరిపినప్పటికీ కూల్ కాలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మల్లు రవి.. ఇతర నేతలతో కలిసి తుమ్మలను రేవంత్ కలిశారు.
టికెట్ రాకపోవడంతో అనుచరులతో కలిసి.. వందలాది కార్లతో ర్యాలీగా హైదరాబాద్ బయల్దేరారు తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao). తన బలం చూపించే ప్రయత్నం చేయగా.. అనూహ్యంగా రేవంత్ అండ్ కో తుమ్మల వద్దకు వచ్చారు. పార్టీలో చేరాలని కోరారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో రాజకీయ అనుబంధం తెంచుకోవాలని ఉందని.. కానీ ప్రజల అభిమానం, ఆత్మీయత, ఆవేదన చూసి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానని తుమ్మల అంటున్నారు. ప్రస్తుతం తనకు రాజకీయాలు అవసరం లేకున్నా.. అభివృద్ది కోసం కొనసాగుతానని స్పష్టంచేశారు. రాజకీయంగా ఎన్నో సార్లు కిందపడ్డప్పటికీ.. తనను ప్రజలు నిలబెట్టారని వివరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే పాలేరు టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ సుముఖంగా ఉందని తెలుస్తోంది. తుమ్మల చేరికతో జిల్లాలో తమ పార్టీ బలపడుతోందని భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తుమ్మల (tummala) సుముఖంగా ఉన్నట్టు సమాచారం. అనుచరులతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారని తెలుస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ (rahul gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉంది.