»Rakesh Reddy Gets Life Time Imprisonment On Jayaram Murder Case
chigurupati jayaram హత్య కేసులో రాకేశ్ రెడ్డికి యావజ్జీవ శిక్ష
chigurupati jayaram:అప్పట్లో సంచలనం రేపిన పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం (chigurupati jayaram) హత్య కేసులో రాకేశ్ రెడ్డి (rakesh reddy) నాంపల్లి కోర్టు (nampally court) జీవిత ఖైతు విధించింది. 2019 జనవరి 31న జయరామ్‌ను (jayaram) రాకేశ్ రెడ్డి హత్య చేశాడు.
Rakesh reddy gets life time imprisonment on jayaram murder case
chigurupati jayaram:అప్పట్లో సంచలనం రేపిన పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరాం (chigurupati jayaram) హత్య కేసులో రాకేశ్ రెడ్డి (rakesh reddy) నాంపల్లి కోర్టు (nampally court) జీవిత ఖైతు విధించింది. 2019 జనవరి 31న జయరామ్‌ను (jayaram) రాకేశ్ రెడ్డి హత్య చేశాడు. ఈ హత్య కేసులో రాకేశ్ రెడ్డిని (rakesh reddy) A1గా నిందితుడిగా ఉన్నాడు. ఈ నెల 6వ తేదీన కేసు విచారణ పూర్తయింది. రాకేశ్ రెడ్డిని (rakesh reddy) దోషిగా తేలుస్తూ కోర్టు ఇదివరకే తీర్పునిచ్చింది. ఈ రోజు నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.
చిగురుపాటి జయరాం (jayaram) హత్యపై జూబ్లీహిల్స్ పోలీసులు 320 పేజీల చార్జిషీట్ (Charge sheet) కోర్టులో దాఖలు చేశారు. 48 మంది సాక్షులు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్ల పాటు విచారణ కొనసాగింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills)కు చెందిన జయరాం కోస్టల్ బ్యాంకు చైర్మన్‌గా, ఎక్స్‌ప్రెస్ టీవీ ఎండీగా ఉండేవారు. ఓ ఫార్మా కంపెనీ యజమాని అనే సంగతి తెలిసిందే. ఆ కంపెనీ నష్టాల్లో ఉండటంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. 2017లో ఆయనకు తన మేనకోడలు శిఖా చౌదరి (Shikha Chaudhary) ద్వారా రాకేశ్ రెడ్డి (rakesh reddy) పరిచయం అయ్యాడు.
చదవండి:duck played పులితో ఆడుకున్న బాతు.. మృగరాజుకు చుక్కలు, వైరల్
జయరాం (jayaram) అతని వద్ద నుంచి రూ.4 కోట్లు (4 crores) అప్పు తీసుకున్నాడు. వడ్డీతో కలిపి రూ.6 కోట్లు (6 crores) చెల్లించాలని రాకేశ్ రెడ్డి (rakesh reddy) ఒత్తిడి చేశాడు. జయరాం అతని ఫోన్ తీయడం కూడా మానేశాడు. అమెరికా (america) వెళ్లి కొంతకాలం తర్వాత వచ్చాడు. ఇది తెలిసిన రాకేశ్ రెడ్డి… జయరాంను (jayaram) హనీ ట్రాప్ వేసి ఒక చోటుకు రప్పించి కిడ్నాప్ చేశాడు. జూబ్లీ హిల్స్‌లో గల తన ఫ్లాట్‌లో బంధించి టార్చర్ చేసి, హతమార్చాడు. మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని అప్పటి నల్లకుంట ఇన్స్పెక్టర్ వద్దకు, తర్వాత హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో తిప్పి విజయవాడ వైపు తీసుకెళ్లాడు.
చదవండి:duck played పులితో ఆడుకున్న బాతు.. మృగరాజుకు చుక్కలు, వైరల్
నందిగామ (nandigama) వద్ద రోడ్డు పక్కన కారు వదిలేసి, ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అక్కడి పోలీసులు (police) టోల్ ప్లాజాల్లో సీసీ కెమెరాల్లో పరిశీలించిగా ఆ కారును రాకేశ్ రెడ్డి నడుపుతున్నట్టు తేలింది. దీంతో రాకేశ్ రెడ్డి నేరం చేసినట్టు రుజువు అయ్యింది. ఈ కేసులో రాకేశ్ రెడ్డికి జీవిత కోర్టు ఖైదు విధించింది.
చదవండి:duck played పులితో ఆడుకున్న బాతు.. మృగరాజుకు చుక్కలు, వైరల్