»Prime Minister Visits Telangana For 3 Consecutive Days
PMMODI : తెలంగాణలో వరుసగా ప్రధాని 3 రోజులు పర్యటనలు
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.
PM Modi Call To People Defeat CM KCR And Revanth Reddy
తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగియడంతో భారతీయ జనతా పార్టీ ప్రచార జోరును పెంచింది.ఇందులో భాగంగా రెండో విడతలో ప్రధాని మోదీ (PMMODI) వరుసగా మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.ఈ నెల 25న కరీంనగర్ సభలో, 26న నిర్మల్ సభలో మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. 27న హైదరాబాద్(Hyderabad)లో రోడ్ షో చేపట్టి ప్రజలను ఓట్లు అభ్యర్థించనున్నారు. ప్రధాని పర్యాటన షెడ్యూల్ ఖరారు కావడంతో బీజేపీ (BJP) రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తోంది.
గెలుపే లక్ష్యంగా మోదీ సభలకు జన సమీకరణ చేయనుంది. బీజేపీ ప్లాన్ చేస్తోంది. రూట్ మ్యాప్ (Route map)పై కసరత్తు చేస్తోంది. రోడ్ షో నిర్వహించాలనుకుంటే ఎల్బీనగర్ (LB Nagar) నుంచి శేరిలింగంపల్లి వరకు పలు అసెంబ్లీ స్థానాలు కవర్ అయ్యేలా చూడాలని పార్టీ భావిస్తోంది. ఇదిలాఉంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పాల్గొనే ఎమ్మార్పీఎస్ (MRPS Sabha) విశ్వరూప మహాసభలో ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. తెలంగాణలోని ఎస్సీ జనాభాలో మాదిగ కులస్తులు 60శాతం ఉంటారు. ఇరవైకి పైగా నియోజకవర్గాల్లో వీరు కీలక ఓటు బ్యాంక్ గా ఉన్నారు. సుమారు ఆరుఏడు నియోజకవర్గాల్లో మాదిగ సామాజిక వర్గం ఓట్లే అభ్యర్థుల గెలుపోటముల్లో కీలక భూమిక పోషించనున్నాయి.