సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానని ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నేత కుమ్మరి వెంకటేశ్ యాదవ్ హామీనిచ్చారు.
Cylinder: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలే కాదు.. అభ్యర్థులు కూడా హామీలు గుప్పిస్తున్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఓ క్యాండెట్ ఇచ్చిన హామీలు చూసి నిజమా..? అనే సందేహాం వస్తోంది.
ఆ అభ్యర్థి ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీకి చెందిన కుమ్మరి వెంకటేశ్ యాదవ్.. అతను సనత్ నగర్ నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడినుంచి తనను గెలిపిస్తే విద్య, వైద్యం, న్యాయ సేవలు.. ఏదైనా సరే రూపాయికే అందిస్తానని చెబుతున్నారు. అంతేకాదండోయ్.. రూపాయికే 4 సిలిండర్లు (Cylinder) ఇస్తానని అంటున్నారు.
ఒంటరిగా ఉండే వృద్ధుల కోసం ప్రత్యేక పథకం ప్రకటించారు. వంద ఇళ్లకు ఓ వాలంటీర్ నియమిస్తానని, ఇంట్లో అమర్చిన పానిక్ బటన నొక్కగానే వచ్చి సేవలు అందజేస్తారని వెల్లడించారు. ఇలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సిలిండర్ ధరలను పార్టీలు తగ్గిస్తుంటే.. రూపాయికే నాలుగు సిలిండర్లు అంటూ హీట్ పుట్టించారు.
సనత్ నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కోట నీలిమ పోటీ చేస్తున్నారు. వీరిందరిలో వినూత్నంగా హామీలు ఇస్తున్నారు వెంకటేశ్. హేమహేమీలు ఉండటంతో జనాలను ఆకట్టుకునేందుకు హామీలను ఇస్తున్నారు.