తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టాలని కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. దాని కోసం ఆయన ఇతర పార్టీలతోనూ చర్చలు జరుపుతుున్నారు. మరో వైపు రాష్ట్రంలోనూ మూడోసారి అధికారం చేపట్టాలని ఆయన చూస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఆయన తమ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ని నియమించుకున్నారు.
కాగా.. ప్రశాంత్ కిషోర్ తన ఐప్యాక్ బృందం ఇప్పటికే అనేకమార్లు తెలంగాణలో సర్వేను నిర్వహించింది. సర్వే ప్రకారం రిపోర్టులను తయారు చేసి సీఎం కు అందించారు. అయితే, సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టిసారించి జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉండటం, ప్రశాంక్ కిషోర్, ఐప్యాక్ వ్యూహాలను పట్టించుకోకపోవడంతో టీఆర్ఎస్ పార్టీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
తెలంగాణ వరకు మాత్రమే ఐప్యాక్ ఒప్పందం ఉందని, జాతీయ స్థాయిలో సర్వేకు ఇబ్బందులు ఉన్నాయని ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ సీఎం కు చెప్పినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక జరగబోయే మునుగోడులో ప్రశాంత్ కిషోర్ బృందం సర్వేను సైతం నిలిపివేసింది. విజయదశమి రోజున సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.