• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు వివరాలు

కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు వివరాలు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ఇలా ఉన్నాయి.. కొల్లూరు (బాన్సువాడ) 39.0°C, మేనూరు(మద్నూర్) 38.6, సోమూరు, సదాశివ నగర్ 38.4, దోమకొండ, జుక్కల్ 38.3, లింగంపేట్, ఎల్పుకొండ 38.2, నాగిరెడ్డి పెట్, మచపూర్, బిచ్కుంద, భిక్నూర్ 38.1, గాంధారి 38.0, బీబీపేట్ 37.9°Cలుగా నమోదయ్యాయి.

March 13, 2026 / 09:18 AM IST

‘ఈ-స్టోర్ విధానం ద్వారా పనులు వేగవంతం’

JGL: వినియోగదారులకు, రైతులకు సేవల్లో వేగాన్ని, పారదర్శకతను పెంచుతూ క్షేత్రస్థాయిలో పనులను సులువుగా చేయడానికి ఈ-స్టోర్ విధానం ఉపయోగపడుతుందని జగిత్యాల SE బీ. సుదర్శనం తెలిపారు. అవసరమైన విద్యుత్ సామగ్రిని ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకునే సౌకర్యం కల్పించారని, అవసరమైన మెటీరియలు కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా నమోదు చేసి ఈ-స్టోర్స్ నుంచి తీసుకుని ప్రారంభించవచ్చాన్నారు.

March 13, 2026 / 09:17 AM IST

‘ఉపాధ్యాయుల సమస్యలపై అసెంబ్లీలోగళమెత్తండి’

VKB: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని టీపీయూఎస్ (TPUS) నేతలు విజ్ఞప్తి చేశారు. తాండూర్లోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనందం వినతిపత్రం అందజేశారు. తక్షణమే వేతన సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు.

March 13, 2026 / 09:16 AM IST

‘ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరిస్తాం’

VKB: ప్రభుత్వ ఇఫ్తార్ విందును బహిష్కరిస్తామని మైనారిటీ నాయకుడు ఎస్ఎం.గౌసన్ అన్నారు. కొడంగల్లో రోడ్డు విస్తరణలో అక్రమంగా తొలగించిన మహిబూబ్ సుభాని దర్గాను యథా స్థానంలో పునః నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చినా.. అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఈ విషయంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించడం లేదని ఆయన ఆరోపించారు.

March 13, 2026 / 09:14 AM IST

కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. తండ్రి మృతి

MBNR: మక్తల్ పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపు డ్రైవర్ చెన్నారెడ్డి మృతి చెందాడు. దండు ప్రాంతానికి చెందిన చెన్నారెడ్డి తన అనారోగ్యంతో ఉన్న కుమారుడు అభినందనను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జీపును ఢీకొట్టింది.

March 13, 2026 / 09:12 AM IST

రైతు సోదరులకు ముఖ్య గమనిక..!

WNP: నాగపూర్ వ్యవసాయ సహకార సంఘం పరిధిలో యూరియా పంపిణీ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 600 బస్తాలు ఇవాళ అందుబాటులో ఉండగా, స్లాట్ బుకింగ్ ఉదయం 9:15 గంటలకు ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రైతులు తమ గుర్తింపు పత్రం, పాసుబుక్/పట్టాదారు పత్రాలు తీసుకుని సమయానికి సంఘం కార్యాలయం వద్ద హాజరుకావాలని కోరారు. బుకింగ్ ముందుగా పూర్తయ్యే అవకాశం ఉన్నందున, ఆలస్యం చేయకుండా చేరుకోవాలని సూచించారు.

March 13, 2026 / 09:12 AM IST

జిన్నారం‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు

SRD: జిన్నారం మున్సిపల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు 12వ రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 146 మంది విద్యార్థులు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. నేడు చివరి పరీక్ష కావడంతో బాగా చదివి రాయనున్నట్లు విద్యార్థులు తెలిపారు.

March 13, 2026 / 09:11 AM IST

రూ.5 భోజనం వెనక పక్కా ప్రణాళిక

హైదరాబాద్‌లో రూ.5 భోజనం వెనక పక్కా ప్రణాళిక ఉంది. ప్రతి ప్లేటు ఖరీదు దాదాపు రూ 24.25 అవుతుండగా, సామాన్యుడు చెల్లించేది రూ.5 మాత్రమే. మిగిలిన రూ.19.25 సబ్సిడీని GHMC భరిస్తోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఏటా రూ.కోట్లు కేటాయిస్తోంది. హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ కేవలం వంట వండటమే కాకుండా నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ బాధ్యతను తీసుకుంది.

March 13, 2026 / 09:10 AM IST

నేడు తాజ్ కృష్ణాలో ‘MUSI INVITES’

HYD: తాజ్ కృష్ణా హోటల్లో MRDCL ఆధ్వర్యంలో నేడు ‘MUSI INVITES’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరుకానున్నారన్నారు. మూసీ నది పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళికలను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

March 13, 2026 / 09:04 AM IST

‘విద్యుత్ శాఖలో ‘ఈ-స్టోర్’తో పనులు వేగవంతం’

KNR: విద్యుత్ మెటీరియల్ సేకరణలో ఇకపై కాగిత రహిత (పేపర్స్) విధానం అమలులోకి వచ్చినట్లు ఎస్ఈ గంగాధర్ తెలిపారు. గతంలో మెటీరియల్ కోసం పలు దశల పేపర్ ప్రక్రియ ఉండేదని, ఇప్పుడు ‘ఈ-స్టోర్’ ద్వారా ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. దీనివల్ల క్షేత్రస్థాయి సిబ్బందికి పని సులభతరమై, సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.

March 13, 2026 / 09:03 AM IST

హన్మంతు మృతి బాధాకరం: ఎమ్మెల్యే

NLG: చింతపల్లి మండలం కిష్టరాయనపల్లి పల్లి గ్రామానికి చెందిన చక్కని హన్మంతు మృతి బాధాకరం అని ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. శుక్రవారం హన్మంతు భౌతిక కాయనికి పూలమాల వేసి, నివాళర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ నర్సింహా రెడ్డి, సర్పంచులు సంతోషి రమేష్, శ్రీను, తదితరులు ఉన్నారు.

March 13, 2026 / 09:01 AM IST

గురుకుల కళాశాలలో నేడు ప్లేస్మెంట్ డ్రైవ్

MBNR: జడ్చర్ల మండలం మాచారం గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో శుక్రవారం కళాశాల ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ నిరీక్షణ రావు ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ప్లేస్మెంట్ డ్రైవ్‌లో హెటిరో కంపెనీ పాల్గొనన్నట్లు తెలిపారు. నిరుద్యోగులు హాజరు కావాలని కోరారు.

March 13, 2026 / 09:01 AM IST

జిల్లాలో రెచ్చిపోయిన చైన్​ స్నాచర్లు

NZB: బంగారం ధర ఆకాశాన్ని అంటింటి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. గోల్డ్​ రేట్స్​ విపరీతంగా పెరగడంతో మరోవైపు దొంగలు సైతం రెచ్చిపోతున్నారు. బైక్​పై వచ్చి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో తాజాగా మరో చైన్​ స్నాచింగ్​ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఒకటో ఠాణా పరిధిలో గురువారం రాత్రి చైన్​ స్నాచర్లు తెగబడ్డారు.

March 13, 2026 / 09:01 AM IST

మద్యం తాగి వ్యక్తిని ఢీకొట్టిన పోలీసులు

MHBD: జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన కొందరు వ్యక్తులు మద్యం తాగి కారుతో ఓ వ్యక్తిని అతివేగంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను గమనించిన కొందరు యువకులు కారును వెంబడించి ఇద్దరు పోలీసులను పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇంకో పోలీస్ వ్యక్తి పరార్‌లో ఉన్నట్లు సమాచారం.

March 13, 2026 / 09:00 AM IST

నర్సంపేట పట్టణంలో రెచ్చిపోతున్న బైక్ దొంగలు

WGL: నర్సంపేట ఎట్టణంల బైక్ దంగలు రెచ్చిపోతున్నారు. గత వారం రోజుల వ్యవధిలోనే ఐదు, ఆరు బైకులు దొంగతనానికి గురవ్వడం స్థానికంగా కలకలం రేపుతోంది. తాజాగా బస్టాండ్ సమీపంలోని కోర్టుగల్లీలో వాహనాలను పార్కింగ్ చేసి బ్యాంకుకు వెళ్లిన యజమానులు, తిరిగి వచ్చేసరికి తమ బైకులు కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నారు.

March 13, 2026 / 08:57 AM IST