KMR: సెక్రటేరియట్‌లో మంగళవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనుల పురోగతి, పోచారం ప్రాజెక్ట్ బలోపేతం, సిల్ట్ తొలగింపు వంటి అంశాలపై చర్చించారు. గత ప్రభుత్వంలో దెబ్బతిన్న మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మతులు, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 23వ తేదీన జరిగిన నాలుగు తులాల వెండి, డబ్బు చోరీ కేసును వన్ టౌన్ పోలీసులు మంగళవారం చేదించారు. కేసు పూర్వపరాలను జిల్లా ఎస్పీ జానకి ఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. చోరీ చేసిన వస్తువులను నిందితుడు రైచూర్‌లో అమ్మేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు చేసిన తనిఖీలలో పట్టుబడినట్లు వెల్లడించారు.
JGL: జగిత్యాల జిల్లా లాగలమర్రి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ సుభద్ర ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం జరిగింది. పోషకాహారం ఆరోగ్యవంతమైన జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సుభద్ర తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన పోషకాహారం గురించి వారికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
SRPT: గ్రామపంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నామినేషన్లు మొదలుకొని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు చూసుకోవాలన్నారు.
MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈనెల 12 వరకు జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు.
MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని రెసిడెన్షియల్ కళాశాలను నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు కోసం కళాశాల ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేందనం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు.
SRD: ఓ హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా జడ్జి భవాని చంద్ర మంగళవారం తీర్పు ఇచ్చారు. సదాశివపేటలో నివాసం ఉంటున్న బీరప్ప 05-08-2021 రోజున నిద్రమత్తులో ఉన్న పాపయ్య అనే వ్యక్తిని బండరాయితో కొట్టి చంపాడు. నేరం రుజువు కావడంతో బీరప్పకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ పరతోష్ పంకజ్ తెలిపారు.
MDK: తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి పై అవగాహన శిక్షణ చేపట్టారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల సిర వినియోగంపై ఆర్డిఓ జయచంద్ర రెడ్డి అవగాహన కల్పించారు. అభ్యర్థులు రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు.
NLG: డైట్ స్కూల్ సమీపంలో మైనర్ బాలికపై హత్యాచారం జరగ్గా ఆ ప్రదేశాన్ని మంగళవారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పరిశీలించారు. కేసు విచారణలో పురోగతి, సాక్ష్యాధారాల సేకరణ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
WGL: గీసుకొండ మండల కేంద్రంలోని గొర్రెకుంట క్రాస్ వద్ద ఇవాళ రాత్రి 7:30 గంటలకు సీఐ విశ్వేశ్వర్ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
NZB: ఇజ్రాయిల్ దాడులను ఆపి వేయాలనీ సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి ఆకుల పాపయ్య అన్నారు. గాజా పై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడిని వ్యతిరేకిద్దామని. గాజా ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుదాం అంటూ మంగళ వారం NZB నగరంలోనీ IFTU ద్వారక నగర్ కార్యాలయం నుంచి వీక్లీ బజార్ చౌరస్తా వరకు పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు.
NGKL: వంగూరు మండల కేంద్రంలో ఆశ వర్కర్ల యూనియన్ నూతన కమిటీని సీఐటీయూ జిల్లా నేత శివరాములు ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సుమతమ్మ అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలిగా మహేశ్వరి, కార్యదర్శిగా బీ. సూర్య కళ, కోశాధికారిగా ప్రియాంక ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
SRCL: సిరిసిల్ల పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్, మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించగా కేటీఆర్ హాజరై పూజలు నిర్వహించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
RR: భారీగా గంజాయిని పట్టుకున్న ఘటన చందానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. విశాఖ నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను విశ్వసనీయ సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 45 కిలోల గంజాయి, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NGKL: గాజాపై జరుగుతున్న మరణకాండను ఆపాలని, ఇజ్రాయిల్‌కు సహకరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని AIYF జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆంజనేయులు, శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా NGKL బస్ స్టాండ్ దగ్గర మంగళవారం AIYF ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ మౌనంవీడి పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు.