NZB: బంగారం ధర ఆకాశాన్ని అంటింటి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరింది. గోల్డ్ రేట్స్ విపరీతంగా పెరగడంతో మరోవైపు దొంగలు సైతం రెచ్చిపోతున్నారు. బైక్పై వచ్చి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్తున్నారు. జిల్లా కేంద్రంలో తాజాగా మరో చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఒకటో ఠాణా పరిధిలో గురువారం రాత్రి చైన్ స్నాచర్లు తెగబడ్డారు.