• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఫిల్టర్ వాటర్ ప్లాంటును ప్రారంభించిన ఎమ్మేల్యే

NGKL: బల్మూరు మండలంలోని పోలిశెట్టిపల్లి గ్రామంలో గ్రామానికి చెందిన పల్లగొర్ల రేణయ్య, గ్రామంలో స్వచ్ఛందంగా ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అతడికి శాలువా కప్పి అభినదించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యువత స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు.

October 13, 2025 / 05:34 PM IST

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే వరి ధాన్యం

SRCL: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్, చిక్కుడువానిపల్లి, అనంతారం, ముస్కానిపేట, గాలిపెల్లి, పొత్తూరు గ్రామాల్లో ఐకేపీ, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

October 13, 2025 / 05:33 PM IST

ఇక పై నిర్లక్ష్యం సహించబోము: MLA

MHBD: జిల్లా MLA క్యాంప్ కార్యాలయంలో సోమవారం డా. భూక్య మురళి నాయక్ ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. DMB కెనాల్‌లో పూడిక, చెట్ల పొదల వల్ల నీటి ప్రవాహం ఆగుతుందని, ఇక పై నిర్లక్ష్యం సహించబోమని అధికారులను హెచ్చరించారు. రేవంత్ సర్కార్ అభివృద్ధి పథకాలను ప్రజలకు చేర్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సీ రామకృష్ణ, ఈఈ వీరస్వామి ఉన్నారు.

October 13, 2025 / 05:33 PM IST

‘సుల్తాన్ పూర్ ప్రభుత్వ భూములను కాపాడండి’

SRD: పటాన్ చెరువు మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 381లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఎం నాయకుడు నాయిని నరసింహారెడ్డి కోరారు. గతంలో ఇదే సర్వే నెంబర్లు 100 గజాలతో పేదల గృహ అవసరాల నిమిత్తం మంజూరు చేశారని, ఇప్పుడు బడా బాబులు వచ్చి అట్టి భూములపై కన్నేసి కబ్జాచేస్తున్నారని అన్నారు. అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని MROకు వినతి పత్రం ఇచ్చారు.

October 13, 2025 / 05:32 PM IST

బాలికల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

జగిత్యాల పట్టణ ధరూర్ క్యాంప్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) స్థానిక MLA డా.సంజయ్ కుమార్ సందర్శించారు. పాఠశాల బోధన తరగతులు, భోజన వసతులు, స్టోర్ రూమ్ , వంట గది శుభ్రత, విద్యార్థినుల ఆరోగ్య వివరాల పట్టిక, హాజరు పట్టికను తదితర అంశాలను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

October 13, 2025 / 05:31 PM IST

‘అన్ని సమస్యలు పరిష్కారం’

ADB: ఆదివాసి గిరిజన ప్రజల అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కుష్బూ గుప్తా తెలిపారు. సోమవారం ఉట్నూర్ పట్టణంలోని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆదివాసి, గిరిజన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

October 13, 2025 / 05:30 PM IST

’12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు’

BDK: కొత్తగూడెం సొసైటీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఛైర్మన్ మండే వీర హనుమంతరావు మాట్లాడారు. సొసైటీ ఆధ్వర్యంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి తీర్మానం చేశామన్నారు. సొసైటీ పరిధిలోని నాలుగు మండలాల రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయడానికి అధికంగా యూరియా కేటాయించాలని తీర్మానించారు.

October 13, 2025 / 05:30 PM IST

ఉనికి కాపాడుకోనికే BRS బాకీ కార్డుల నాటకం

MNCL: కోల్పోయిన ఉనికి కాపాడుకోవడానికే BRS నాయకులు బాకీ కార్డులని ఊరూరా తిరుగుతున్నారని కాసిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ.. గడిచిన 10 ఏళ్ళు అధికారంలో ఉన్న BRS ప్రభుత్వం ప్రజలకు ఒక్క డబుల్ బెడ్ రూమ్, రేషన్ కార్డ్ ఇచ్చిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తుందన్నారు.

October 13, 2025 / 05:28 PM IST

కొండా సురేఖతో విభేదాలు నిజం కాదు: పొంగులేటి

MLG: మేడారంలో సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖతో విభేదాల గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. “చిన్న కాంట్రాక్టుల కోసం ఆశపడను. సురేఖ నాపై ఫిర్యాదు చేశారని అనుకోవడం లేదు. ఈ రోజు ఆమె పర్యటనకు రాకపోవడానికి ప్రత్యేక కారణం లేదు. అందరూ ఎప్పుడూ ఉండాలనేం లేదు. తదుపరి పర్యటనలో అందరూ ఉంటారు” అని తెలిపారు.

October 13, 2025 / 05:24 PM IST

ఈవిఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

KMM: నెలవారి తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న EVM గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవిఎం గోడౌన్ సీల్‌ను EVM, V.V ప్యాట్లు ఉన్న గది సీల్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఫైర్ అలారం సరి చూసుకోవాలని, అగ్నిమాపక యంత్రాలు కండీషన్ పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆయన సూచించారు.

October 13, 2025 / 05:21 PM IST

అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: ఎమ్మెల్యే వేముల

NLG: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. సోమవారం నకిరేకల్‌లో డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక కార్యక్రమంలో ఏఐసీసీ మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరాజన్ మహంతి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలని అభ్యర్థించారు

October 13, 2025 / 05:17 PM IST

ధాన్యం కనుగోలు కేంద్రం ప్రారంభం

NZB: భీమ్‌గల్ మండలం మెండోరాలో సోమవారం సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

October 13, 2025 / 05:16 PM IST

మహేష్ మృతికి ఇక్బాల్ హుస్సేన్ నివాళి

BDK: కరకగూడెం మండలం వటం వారి గుంపు‌కు చెందిన కొమరం మహేష్ విద్యుత్ షాక్‌తో సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మహేష్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.

October 13, 2025 / 05:11 PM IST

ఈనెల 14న విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక

MNCL: బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాల విద్యుత్ వినియోగదారులకు ఏవైనా సమస్యలు ఉంటే ఈనెల 14న నిర్వహించనున్న విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికలో పరిష్కరించుకోవాలని ADE రాజశేఖర్ సోమవారం సూచించారు. కాల్టెక్స్ వద్ద పరిష్కార వేదిక ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉ:10:30 నుంచి మ:1 గంట వరకు నిర్వహించనున్న పరిష్కార వేదికలో వినియోగదారులు పాల్గొనాలన్నారు.

October 13, 2025 / 05:09 PM IST

VIDEO: వనదేతాలను దర్శించుకున్న మంత్రులు

MLG: తాడ్వాయి మండలంలో ఉన్న సమ్మక్క సారలమ్మ తల్లులను సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం జాతర ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన మంత్రులు, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

October 13, 2025 / 05:05 PM IST