BDK: కరకగూడెం మండలం వటం వారి గుంపుకు చెందిన కొమరం మహేష్ విద్యుత్ షాక్తో సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మహేష్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని హామీ ఇచ్చారు.