SRD: పటాన్ చెరువు మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 381లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని సీపీఎం నాయకుడు నాయిని నరసింహారెడ్డి కోరారు. గతంలో ఇదే సర్వే నెంబర్లు 100 గజాలతో పేదల గృహ అవసరాల నిమిత్తం మంజూరు చేశారని, ఇప్పుడు బడా బాబులు వచ్చి అట్టి భూములపై కన్నేసి కబ్జాచేస్తున్నారని అన్నారు. అట్టి వారిపై చర్యలు తీసుకోవాలని MROకు వినతి పత్రం ఇచ్చారు.