• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బైక్ అదుపుతప్పి బోల్తా.. దంపతులకు గాయాలు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో బైక్ అదుపు తప్పి బోల్తా పడడంతో దంపతులకు గాయాలను సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. రహీం రజియా దంపతులు తమ కుమారుడు కలిసి బైక్ పై వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తున్న క్రమంలో జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను తప్పించబోయి బైక్ బోల్తా పడింది. దీంతో దంపతులకు గాయాలు కావడంతో వారిని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు.

October 14, 2025 / 08:19 PM IST

ధరూర్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సంపై పోలీసుల విచారణ

JGL:  జగిత్యాల అర్బన్ గ్రామం ధరూర్‌లో అర్ధరాత్రి దొంగలు బీభత్సంపై పోలీసులు విచారణ చేపట్టారు. తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లలో చొరబడి సుమారు 7 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.2లక్షల 70వేల నగదు, ఒక బైకును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాను పరిశీలిస్తున్నారు.

October 14, 2025 / 08:17 PM IST

మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం

JGL: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ గిరి నాగభూషణం, పబ్లిక్ హెల్త్ ఈఈ సంపత్, డీఈలు ఆనంద్, వరుణ్, ఏఈలు శరన్, అనిల్ తదితరులు సమావేశంలో పాల్గొని ప్రాజెక్టుల పురోగతిని చర్చించారు. ఎమ్మెల్యే నాణ్యత, సమయపాలనపై మార్గదర్శకాలు ఇచ్చారు.

October 14, 2025 / 08:16 PM IST

‘వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగాలి’

RR: వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా, అక్రమాలకు తావు లేకుండా జరగాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, మిల్లర్లు, సివిల్ సప్లయ్ అధికారులతో మంగళవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు.

October 14, 2025 / 08:10 PM IST

ఇందిరమ్మ ఇళ్ల పనులపై కలెక్టర్ సమీక్ష

NRPT: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా పనుల్లో ఆలస్యం జరుగుతున్నందుకు ఆమె అసహనం వ్యక్తం చేశారు. గ్రేడింగ్ పూర్తయిన ఇళ్లను వెంటనే ప్రారంభించి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె అన్నారు.

October 14, 2025 / 08:09 PM IST

‘కార్యకర్తలను సంప్రదించాకే డీసీసీ అధ్యక్షుడి నియామకం’

KMR: జిల్లాలోని ప్రతి నియోజకవర్గం, మున్సిపాలిటీ, వార్డులు సందర్శించి అట్టడుగు స్థాయి కార్యకర్తలతో సంప్రదించిన తర్వాతే కొత్త నాయకులను నియమిస్తారని ఏఐసీసీ పరిశీలకుడు రాజ్​పాల్ కరోలా స్పష్టం చేశారు. మంగళవారం డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం పట్టణంలోని ఆర్అండ్​బీ గెస్ట్ హౌస్​లో కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

October 14, 2025 / 08:07 PM IST

డిగ్రీ సెమిస్టర్ ఫీజు తగ్గించాలని ఆందోళన

HNK: పట్టణ కేంద్రంలోని అశోక జంక్షన్ వద్ద డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్ ఫీజు తగ్గించాలని SSU ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా SSU నాయకుడు సాయికుమార్ మాట్లాడుతూ… KU పరిధిలో యూనివర్సిటీ ఫీజు 1300 రూపాయలు పెంచడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. విసీ స్పందించి పాత విధానము కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేశారు.

October 14, 2025 / 08:06 PM IST

చేనేత ప్రదర్శన శాల ప్రారంభించిన జడ్జీలు

WGL: జిల్లా కోర్టు ప్రాంగణంలో చేనేత ప్రదర్శన, అమ్మకాల మేళా మంగళవారం ప్రారంభమైంది. WGL, HNK జిల్లాల కోర్టు ప్రధాన న్యాయమూర్తి లలితంబ, పట్టాభిరాములు ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా ఈ ప్రదర్శన శాలను ప్రారంభించారు. చేనేత హస్తకళలను, వస్త్రాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు, తదితరులు ఉన్నారు.

October 14, 2025 / 07:57 PM IST

పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలి: SP

ASF: నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఆసిఫాబాద్ SP కాంతిలాల్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా SP కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో గ్రేడ్, నాన్ గ్రేడ్ పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గంజాయి సాగు నిర్మూలనకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామన్నారు.

October 14, 2025 / 07:55 PM IST

బర్రెల దొంగతనం..రైతు ఆందోళన

HNK: భీమదేవరపల్లి (M) కొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు సిక జేమ్స్‌కు చెందిన మూడు బర్రెలను మంగళవారం దొంగలు ఎత్తుకెళ్లారు. వ్యవసాయ బావి వద్ద కట్టివేసిన ఈ బర్రెల విలువ సుమారు మూడు లక్షల రూపాయలని రైతు తెలిపారు. ఈ ఘటనతో రైతు ఆందోళనకు గురయ్యారు. స్థానిక పోలీసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దొంగతనం జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేపట్టారు.

October 14, 2025 / 07:54 PM IST

విద్యార్థుల సామర్థ్యం పెంచడం హెచ్ఎంల బాధ్యత

BDK: పిల్లల సామర్థ్యాల పెంపుదలలో ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో హెచ్ఎంల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి తన బాధ్యత అని, పిల్లల సామర్థ్యాల పెంపుదల కోసం కృషి చేయాలన్నారు.

October 14, 2025 / 07:53 PM IST

పెన్ పహాడ్ క్వాలిటీ చికెన్ సెంటర్‌పై తనిఖీ

SRPT: పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి క్వాలిటీ చికెన్ సెంటర్‌నీ ఇవాళ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ తనిఖీ చేశారు. అపరిశుభ్రతగా పరిసరాలు శుభ్రంగా లేని యందున వారిని మందలించి వారికి నోటీసు ఇచ్చి జరిమానా విధించారు. ప్రజల ఆరోగ్యాలతో దుకాణాదారులు చెలగాటాలు ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

October 14, 2025 / 07:52 PM IST

‘ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను అందించాలి’

SDPT: సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు రైతులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల ప్రొ. జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో రైతు సదస్సు వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా  వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను ఆమె ప్రారంభించారు.

October 14, 2025 / 07:52 PM IST

‘విద్యార్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలి’

ASF: రాష్ట్రంలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలో కలెక్టర్లతో మాట్లాడగా ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే పాల్గొన్నారు. పాఠశాలలలో చదివే విద్యార్థుల సంక్షేమంపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

October 14, 2025 / 07:50 PM IST

అడ్డాకులలో ఎఫ్‌ఎండీ టీకా డ్రైవ్ ప్రారంభం

MBNR: అడ్డాకుల మండలంలోని అన్ని గ్రామాల్లో రేపటి నుంచి నవంబర్ 14 వరకు గాలి కుంటు (ఎఫ్‌ఎండీ) నివారణ టీకా కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు మండల పశువైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. ప్రతి గ్రామంలో పశువైద్య బృందాలు పర్యటించి పశువులకు టీకాలు వేస్తామని చెప్పారు. పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

October 14, 2025 / 07:49 PM IST