ASF: నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ఆసిఫాబాద్ SP కాంతిలాల్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా SP కార్యాలయంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో గ్రేడ్, నాన్ గ్రేడ్ పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గంజాయి సాగు నిర్మూలనకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామన్నారు.