W.G: భీమవరంలో తల్లీకొడుకు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డీఎస్పీ జయ సూర్యతో కలిసి పరిశీలించారు. తల్లి, తమ్ముడిని హత్య చేసిన నిందితుడు శ్రీనివాస్ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. సోమవారం ఉదయం ఈ హత్య జరిగిందని.. అ తర్వాత నిందితుడు 112కు కాల్ చేసి పోలీసులకు లొంగిపోయాడని ఆయన వెల్లడించారు.