JGL: జగిత్యాల అర్బన్ గ్రామం ధరూర్లో అర్ధరాత్రి దొంగలు బీభత్సంపై పోలీసులు విచారణ చేపట్టారు. తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లలో చొరబడి సుమారు 7 తులాల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.2లక్షల 70వేల నగదు, ఒక బైకును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాను పరిశీలిస్తున్నారు.