SDPT: సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఆరోగ్యకర ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు రైతులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల ప్రొ. జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో రైతు సదస్సు వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ ప్రదర్శన స్టాళ్లను ఆమె ప్రారంభించారు.