• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాల్లో ప్రజావాణి తిరిగి ప్రారంభం: కలెక్టర్

వనపర్తి: జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోవడంతో, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

October 12, 2025 / 06:21 AM IST

రైస్ మిల్లుల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

MBNR: జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి శనివారం జిల్లాలోని వివిధ మండలాల్లోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మహబూబ్నగర్ పట్టణంతోపాటు గండీడ్, నవాబుపేట, భూత్పూర్, మహమ్మదాబాద్ మండలాల్లోని మిల్లులను పరిశీలించారు. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) పెండింగ్ ఎక్కువగా ఉన్న రైస్ మిల్లులను ఎన్‌ఫోర్స్‌మెంట్  డిప్యూటీ తహసీల్దార్లు తప్పకుండా సందర్శించాలన్నారు.

October 12, 2025 / 06:15 AM IST

‘కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగ పరుచుకోవాలి’

WGL: కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. గీసుగొండ మండలంలోని కొనాయిమాకుల రైతు వేదికలో ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని, ప్రసారాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రైతులు పాల్గొన్నారు.

October 12, 2025 / 06:15 AM IST

బంగారం చోరీ చేసిన నిందితుడి అరెస్టు

SRD: వృద్ధురాలికి మాయమాటలు చెప్పి బంగారం, వెండి వస్తువులతో పరారైన నిందితుని అరెస్టు చేసినట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ తెలిపారు. పుల్కల్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంగారెడ్డికి చెందిన సత్యమ్మకు మాయ మాటలు చెప్పి బన్సీలాల్ అనే వ్యక్తి బైక్‌పై ఎక్కించుకున్నాడు. పుల్కల్ మండలం గంగూరు శివారులోకి రాగానే సత్తమ్మ కడియాలు, చెవి కమ్మలు బలవంతంగా లాక్కునడు.

October 12, 2025 / 06:15 AM IST

రోడ్లపై ధాన్యం పోస్తే చర్యలు: ఎస్సై

NZB: భీమగల్ సర్కిల్ పరిధిలోని BT రోడ్లపై ధాన్యాలు ఆరబెడితే చర్యలు తీసుకుంటామని ఎస్సై కే.సందీప్ పేర్కొన్నారు. భీమగల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వ్యవసాయదారులు మక్కలు, వరి ధాన్యాలు, సోయా ఇతర పంటలు రోడ్లమీద పోయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.

October 12, 2025 / 06:14 AM IST

శరణపల్లిలో ఐమాక్స్ లైట్లు ప్రారంభం

NRPT: నారాయణపేట మండలం శరణపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను పాలమూరు ఎంపీ డీకే అరుణ శనివారం ప్రారంభించారు. ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగ్ పాండు రెడ్డి, బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

October 12, 2025 / 06:13 AM IST

చికిత్స పొందుతూ.. మహిళ మృతి

MDK: కొల్చారం మండలం ఏడుపాయల సమీపంలో అత్యాచారానికి గురై అపస్మారక స్థితిలో గుర్తించిన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. మెదక్ మండలానికి చెందిన 35 ఏళ్ల మహిళను గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి తీసుకువచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్వారక స్థితిలోకి వెళ్ళగా చీరతో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం గుర్తించి ఆసుపత్రికి తరలించారు.

October 12, 2025 / 06:10 AM IST

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: టీపీటీఎఫ్

SRD: విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ శనివారం డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఉపాధ్యా యులను టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా చూడాలని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని పేర్కొన్నారు.

October 12, 2025 / 06:10 AM IST

నాలాల విస్తరణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల అంచనా వ్యయంతో నాలాల విస్తరణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. వరద ముంపు సమస్య నుంచి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, నాలాల విస్తరణ పనులతో ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభిస్తుందన్నారు.

October 12, 2025 / 06:08 AM IST

4 గంటలు విద్యుత్ నిలిపివేత

SDPT: పట్టణంలోని ఇందూర్ సబ్‌స్టేషన్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కంచరి బజార్, బురుజు ఏరియా, సుభాష్ రోడ్డు, ఓల్డ్ బస్టాండ్, మోహినిపుర, ఓల్డ్ మార్కెట్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

October 12, 2025 / 05:59 AM IST

హైకోర్టు స్టే.. BCల్లో నిరాశ.!

MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోకు హైకోర్టు స్టే విధించడంతో BC వర్గాల్లో నిరాశ నెలకొంది. అదే సమయంలో జనరల్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ZPTC స్థానాల్లో రెండు, మూడు మాత్రమే జనరల్‌కు కేటాయించడంతో వారు ఇప్పటివరకు నిరుత్సాహంలో ఉన్నారు.

October 12, 2025 / 05:52 AM IST

బంగారం దొంగిలించిన వ్యక్తికి రిమాండ్

NZB: ధర్పల్లికి చెందిన వృద్ధురాలు కుర్రి లక్ష్మి వద్ద అక్టోబర్ 1న బంగారు చెవి కమ్మలు దొంగిలించిన కేసులో మాచారెడ్డికి చెందిన గడీల బైరయ్య పట్టుకున్నట్లు శనివారం ఎస్సై కల్యాణి తెలిపారు. నిందితుడి నుంచి చెవి కమ్మలు, బైకును స్వాధీనం చేసుకుని రిమాండు తరలించారు. కేసును త్వరితగతిన చేధించినందుకు సీఐ భిక్షపతి.. ఎస్సై కల్యాణి, సిబ్బంది ప్రసాద్, అభినందించారు.

October 12, 2025 / 05:26 AM IST

సామాజిక సేవకులను సన్మానించుకోవడం ఒక గొప్ప గౌరవం

MBNR: సామాజిక సేవకులను సన్మానించుకోవడం ఒక గొప్ప గౌరవమని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ సౌత్ మండల శాఖ ఆధ్వర్యంలో సేవా పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

October 12, 2025 / 05:26 AM IST

ఉద్యమకారుడికి గాయాలు.. పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని నేహా షైన్ ఆసుపత్రిలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా పరిషత్ మాజీ కో అప్షన్ సభ్యులు పొన్నకల్ మైముద్ శనివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరమర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

October 12, 2025 / 05:18 AM IST

అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలు గడుపు పెంపు

KNR: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం మొదటి సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 15 చివరి తేదీ అని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రమేష్ తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అలాగే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివారలకు 7382929775ను సంప్రదించాలన్నారు.

October 12, 2025 / 05:16 AM IST