MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవోకు హైకోర్టు స్టే విధించడంతో BC వర్గాల్లో నిరాశ నెలకొంది. అదే సమయంలో జనరల్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ZPTC స్థానాల్లో రెండు, మూడు మాత్రమే జనరల్‌కు కేటాయించడంతో వారు ఇప్పటివరకు నిరుత్సాహంలో ఉన్నారు.