• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బీసీ నాయకుల ముందస్తు అరెస్టులు

NZB: నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పలువురు బీసీ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ని, అదేవిధంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యాల శంకర్‌ను అరెస్టు చేసి నాలుగో టౌను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీసీ ద్రోహులకు వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు.

October 10, 2025 / 05:40 PM IST

‘ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి’

KMM: ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈనెల 13 నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ 10 రోజుల పాటు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. నగర వ్యాప్తంగా పేరుకు పోయిన చెత్తను శుభ్రం చేయాలని సూచించారు.

October 10, 2025 / 05:38 PM IST

నిరూపిస్తే రాజీనామా చేస్తా: కార్పోరేటర్

WGL: ఖిలా వరంగల్‌లో తనకు ఇందిరమ్మ ఇళ్లు వచ్చిందని, ప్రొసీడింగ్ కూడా తీసుకున్నానని కొన్ని పత్రికలు తప్పుడు వార్త ప్రచురించాయని 38డివిజన్ కార్పొరేటర్ ఉమాయాదవ్ శుక్రవారం మీడియా సమావేశంలో మండిపడ్డారు. తాను ఏ కాపీ తీసుకోలేదని, నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. తప్పుడు వార్తలు రాసిన రిపోర్టర్లు క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరువువష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

October 10, 2025 / 05:36 PM IST

నిజాయితీ చాటుకున్న మాజీ ఎంపీపీ

SRCL: చందుర్తి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు చిలుక పెంటయ్య తన నిజాయితీని చాటుకున్నారు. చిలుక పెంటయ్యకు గత సెప్టెంబర్ 14వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌పే ద్వారా రూ. 49850 జమయ్యాయి. శుక్రవారం రోజున ఈ డబ్బులు నగదును తీసుకెళ్లి చందుర్తి ఎస్సై రమేష్‌కు చిలకపెంటయ్య అప్పగించారు ఆయన వెంట మాజీ కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ ఉన్నారు.

October 10, 2025 / 05:34 PM IST

వంకేశ్వరంలో పండ్ల మొక్కలు పంపిణీ

NGKL: పదర మండలం వంకేశ్వరం గ్రామంలో శుక్రవారం ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివాసులకు పండ్ల మొక్కలు, సోలార్, బోర్‌‌లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సంస్థ ప్రతినిధులు రాజేష్ మాట్లాడుతూ.. ఆదివాసుల అభివృద్ధి కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్, గ్రామ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

October 10, 2025 / 05:30 PM IST

BRS పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ MLA

MHBD: ఇనుగుర్తి మండల కేంద్రంలో BRS పార్టీ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ MLA బానోతు శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక BRS కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానికులకు కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు.

October 10, 2025 / 05:29 PM IST

పర్యావరణం పరిరక్షణకు ఆదర్శంగా నిలవాలి: డీఈవో

SDPT: రూరల్ మండలం చింతమడక ప్రాథమిక పాఠశాలను సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల్లో పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటారు. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి, భోజనం నాణ్యత, విద్యార్థుల హాజరు, శుభ్రతపై అధికారులను సూచనలు ఇచ్చారు.

October 10, 2025 / 05:27 PM IST

కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశమైన కలెక్టర్

KNR: ఎవరయినా 10 సంవత్సరాలు ఎక్కువ కాలం బ్యాంకు ఖాతాలో మొత్తం ఉండి మరచి పోయినవారు బ్యాంక్‌కు వచ్చి ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ ఇచ్చి వారి ఖాతాల ఆపరేషన్‌లోకి తెచ్చుకోవాలని కలెక్టర్ తెలియజేసారు. గూగుల్‌లో ఉద్గం పోర్టల్‌లో రిజిస్టర్ అయి మీ వివరాలు తెలుసుకోవచ్చని తెలియచేసారు. ఖాతాదారుల గుర్తింపుతో ఖాతాల నిర్వహణకు మద్దతు ఇవ్వాలన్నారు.

October 10, 2025 / 05:26 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన DMHO

NGKL: అచ్చంపేట పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి కుమార్ శుక్రవారం సందర్శించారు. ఆస్పత్రిలో రికార్డులతో పాటు హాజరు పట్టికను పరిశీలించిన అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

October 10, 2025 / 05:21 PM IST

కిడ్నీ వ్యాధిగ్రస్తురాలి కుటుంబానికి ఎల్‌వోసీ అందజేత

JGL: రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన తోగిటి లత కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా, ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందించారు. నిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించేందుకు రూ.2.50 లక్షల విలువైన ఎల్‌వోసీ శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

October 10, 2025 / 05:19 PM IST

పండ్లు పంపిణీ చేసిన నర్సాపూర్ న్యాయమూర్తి

MDK: శివంపేట మండలం దొంతి (మగ్దుంపూర్) బెతాని సంరక్షణ ఆశ్రమంలో మానసిక వికలాంగులకు నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హేమలత పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మానసిక వైకల్యం కలిగిన చిన్నారుల పట్ల సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు.

October 10, 2025 / 05:19 PM IST

‘కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి’

SRPT: కార్మిక సమస్యలను మేనేజ్మెంట్ వెంటనే పరిష్కరించాలని సిమెంట్ క్లస్టర్ పరిశ్రమ వర్కర్స్ యూనియన్(CITU) జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను అన్నారు. ఇవాళ మేళచెరువు మండల పరిధిలోని రామపురం గ్రామంలో తీగల శ్రీను అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ సైదులు, యూనియన్ కార్యదర్శి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

October 10, 2025 / 05:17 PM IST

HNK: ఈనెల 13వ అప్రెంటిస్క్రిప్ మేళా

ఈనెల 13(సోమవారం)రోజున HNK ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్క్రిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జి.సక్రు శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు apprenticeshipindia.gov.in/mela-registrationలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో మేళాకు హాజరుకావాలని సూచించారు. ఐటీఐ పాసై 28ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

October 10, 2025 / 05:14 PM IST

ఆదివాసీ విద్యార్థులను ఆదుకోవాలి: జాలింషావ్

ADB: నిరుపేద గిరిజన ఆదివాసీ విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని సంక్షేమ పరిషత్ విద్యార్ధి సంఘం మండలాధ్యక్షుడు జాలింషావ్ అన్నారు. శుక్రవారం నార్నూర్ మండల కేంద్రంలోని కొమురంభీం చౌక్ ఎదుట మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ రాక ఫీజు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు.

October 10, 2025 / 05:10 PM IST

సైన్సు‌కు కళను జోడిస్తే మరింత మెరుగైన ఫలితాలు

KNR:సైన్సుకు కళను జోడిస్తే విద్యార్థులు మరింత ప్రభావవంతంగా నేర్చుకొని మెరుగైన ఫలితాలు సాధిస్తారని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కళాభారతిలో పాఠశాల విద్యాశాఖ కరీంనగర్ జిల్లా స్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్‌ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞానశాస్త్రాన్ని కళ అన్నారు.

October 10, 2025 / 05:10 PM IST