SRCL: చందుర్తి మాజీ మండల పరిషత్ అధ్యక్షులు చిలుక పెంటయ్య తన నిజాయితీని చాటుకున్నారు. చిలుక పెంటయ్యకు గత సెప్టెంబర్ 14వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌పే ద్వారా రూ. 49850 జమయ్యాయి. శుక్రవారం రోజున ఈ డబ్బులు నగదును తీసుకెళ్లి చందుర్తి ఎస్సై రమేష్‌కు చిలకపెంటయ్య అప్పగించారు ఆయన వెంట మాజీ కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్ ఉన్నారు.