JGL: రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామానికి చెందిన తోగిటి లత కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా, ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందించారు. నిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించేందుకు రూ.2.50 లక్షల విలువైన ఎల్వోసీ శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళి, రమేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.