వనపర్తి: జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 13 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోవడంతో, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని కోరారు.