RR: షాద్ నగర్ పట్టణంలోని అడ్వకేట్ కాలనీలో ప్రమాదపు అంచున ఓ ఇంటి నిర్మాణం జరుగుతుందని స్థానికులు ఆరోపించారు. విద్యుత్ స్తంభాన్ని వైర్లను ఆనుకొని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని, వర్షాలు పడిన సమయంలో, ఇతర కారణాల వల్ల ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే ఈ నిర్మాణం పట్ల స్పందించాలని కోరారు.