MBNR: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మీడియా ప్యానలిస్టుగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎదర గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా BJP రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
MHBD: BJP రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు N. రామచంద్ రావు, జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మరిపెడ MRO కార్యాలయంలో MROకు BJP మండల అధ్యక్షుడు గంగాధర్ వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకపోతే BJP పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
MLG: న్యూ-ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు విక్రాంత్ భూరియా అధ్వర్యంలో జరిగిన ఏఐసీసీ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఆదివాసీల హక్కులు, అభివృద్ధి, స్వాభిమానాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు.
MNCL: కోల్ మైన్స్ పెన్షన్ పథకం-1998 వెంటనే సవరించాలని పెద్దపల్లి MP వంశీకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలో CMPF కమిషనర్ సంజీష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు వస్తున్న పెన్షన్ చాలా తక్కువగా ఉందని, దానివల్ల వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడిపేలా పెన్షన్లు పెంచాలన్నారు.
KMM: బోనకల్ రైతు వేదికలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణా కార్యక్రమంలో సీడీపీఓ బాల త్రిపుర సుందరి మహిళల అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అక్రమ రవాణా, సైబర్ నేరాలు, బీఎన్ఎస్, ITPA, POCSO చట్టాలు, 1098, 1930, 100 టోల్ ఫ్రీ నంబర్లపై అవగాహన కల్పించారు. ప్రేమ, పెళ్లి, సినిమా అవకాశాల పేరుతో మహిళలను వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారని తెలిపారు.
NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో బుధవారం వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పున్న శైలజ పాల్గొన్నారు. ప్రిన్సిపల్, ప్రొఫెసర్ రమావత్ రవి మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి వెళ్ళిన విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌కు ఘనంగా సన్మానం చేశారు.
KMR: మమ్మద్ నగర్ మండలం తెల్గాపూర్ శివారులో ఎలుగుబంటి మంగళవారం కనిపించడంతో గ్రామాల్లో భయం నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి బుధవారం ఎలుగుబంటి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.
SRCL: జిల్లాలోని అన్ని బ్యాంకులు ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఛైర్ పర్సన్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. ముందుగా వ్యవసాయ, గృహ, విద్య రుణాలపై సమీక్ష నిర్వహించారు.
SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ ఎస్పీ నరసింహ ఐపీఎస్ నెలవారీ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా శాంతిభద్రతలు, మహిళా భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన పెంచాలని సిబ్బందిని ఆదేశించారు. అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
MDK: సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలకు మెమో జారీచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. నర్సాపూర్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.. అంగన్వాడి ఉద్యోగులకు ప్రభుత్వం మెమో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
KNR: జమ్మికుంట మండలంలో దళితబంధు రెండో విడత నిధులను తక్షణమే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో పద్మకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన నిధుల జాప్యంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చిలివేరు శ్రీకాంత్ పాల్గొన్నారు.
MDK: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ డిమాండ్ చేశారు. కౌడిపల్లి మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వికలాంగులకు రూ. 6000 పెన్షన్, మహిళలకు రూ.2500 పెన్షన్, వ్యవసాయ కూలీలకు రూ. 12000 అమలు చేయాలన్నారు.
MHBD: మున్సిపాలిటీ 36వ వార్డ్ కౌన్సిలర్ ముత్యం వెంకన్నగౌడ్ ఉదారతను చాటుకున్నారు. వార్డులోని పారిశుధ్య కార్మికులకు తన సొంత ఖర్చుతో నూతన వస్త్రాలు అందజేసారు. ఈ వస్త్రాలను మున్సిపల్ చైర్మన్ జ్యోతిరమేష్, కమీషనర్ రాజశేఖర్‌లతో కలసి కౌన్సిలర్ సిబ్బందికి బుధవారం పంపిణీచేశారు. ఉగాది పండుగ కానుకగా ఈ నూతన వస్త్రాలను అందజేసిన కౌన్సిలర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ASF: పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ బుధవారం సూచించారు. పిల్లలకు ఈత నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు.
SDPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం ఆకునూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అపూర్వ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.