RR: ఇబ్రహీంపట్నంలో ప్రజాతీర్పును అధికార బలం వెక్కిరిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో 15 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీ సాధించినా, 8 స్థానాలున్న కాంగ్రెస్ కూడా పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కిడ్నాప్ రాజకీయాలు, అధికారులపై ఒత్తిళ్ల నేపథ్యంలో మున్సిపల్ రాజకీయ చదరంగంలో ఎవరికెవరు చెక్ పెడతారో చూడాలి.
ADB: బోథ్ మండలంలోని కౌటా గ్రామంలో శబరిమాత ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ఆయన కోరుకున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
MNCL: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తండ్రి గోనె పోషం ఇటీవల మృతి చెందారు. విషయం తెలిసిన మంత్రి వివేక్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
JGL: మల్యాల మండలం ముత్యంపేట శివారులోని వరదకాలువ (82.03km) బ్రిడ్జికి సంబంధించిన ఒక పిల్లరుకు పగుళ్లు ఏర్పడడంతో తాత్కాలికంగా బ్రిడ్జిని ఇరిగేషన్ అధికారులు మూసేశారు. ఈ బ్రిడ్జిపై నుంచి క్రషర్ల భారీ వాహనాల రాకపోకల కారణంగా బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి మూసేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
NRML: జిల్లాలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల సుమారు 5 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించాయి. ముఖ్యంగా మక్కజొన్న పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి త్వరితగతిన నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ అధికారులను శుక్రవారం ప్రకటనలో ఆదేశించారు.
గద్వాల జిల్లా సమీపంలో వెలసిన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. కృష్ణా నది జలాలతో అభిషేకం, ఆకు పూజ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రంగుల చీరలతో అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు.
SRCL: పాక్షిక చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3వ తేదీన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలతో పాటు అన్ని అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున ప్రాతఃకాల పూజలు ముగిసిన వెంటనే ద్వారబంధనం చేయనున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతిస్తారు.
సూర్యాపేటలో కాంగ్రెస్ రౌడీ రాజకీయాలను సహించేది లేదని మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ హెచ్చరించారు. కేసీఆర్ జన్మదిన ప్లెక్సీని తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ నేతలు ధ్వంసం చేసి కాలువలో పడేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంస్కృతి లేదని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.
BHPL: గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో దోమల పెరుగుదలపై సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. గ్రామంలో దోమల తీవ్రతతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో సమస్యను పరిశీలించి నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా పంచాయతీ సిబ్బందితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దోమల నివారణ మందును పిచికారీ చేయించారు.
NZB: నిజామాబాద్ జిల్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. కేసులో ఆమె పేరును కూడా రౌస్ అవెన్యూ కోర్టు డిశ్ఛార్జ్ చేసింది. అధారాలు లేకుండా ఇరికించారని సీబీఐపై కోర్టు ఆగ్రహించింది. దీంతో కవితకు క్లీన్‌చిట్ లభించినట్లు అయింది. కాగా ఈ కేసులో కవిత గతంలో జైలుకెళ్లారు.
MDK: భూమి కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని రైతు గుర్తింపు కార్డు పొందాలని మనోహరాబాద్ మండల వ్యవసాయ అధికారి స్రవంతి తెలిపారు. మండలంలోని కుచారం క్లస్టర్ పరిధిలోని కాళ్లకల్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సచిన్, రైతులు పాల్గొన్నారు.
BDK: ఆళ్లపల్లి మండలం చింతోళ్లగుంపు గ్రామానికి చెందిన గొగ్గెల సాయిని పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఎస్సై ఎం. సోమేశ్వర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. సీఎం కప్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సాయి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. యువత తమలోని నైపుణ్యాన్ని గుర్తించి క్రీడల్లో రాణించాలని వారు సూచించారు.
JGL: రాష్ట్రస్థాయి సీఎం కప్ కిక్ బాక్సింగ్ పోటీల్లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీల్లో ఏ. హర్షిత్, పి. కృష్ణ గోల్డ్ మెడల్స్ సాధించగా, ఆర్. అక్షయ్ సిల్వర్, ఎం. సాయి సృజన్, బి. కనిష్క్ బ్రాంజ్ మెడల్స్ గెలుచుకున్నారు. విజేతలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అభినందించారు.
MDCL: స్థానికులకు ఆధునిక బ్యాంకింగ్ సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయని అల్వాల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు తెలిపారు. శుక్రవారం అల్వాల్ పట్టణం, జ్యోతి నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ యూనియన్ బ్యాంక్ 915వ బ్రాంచ్‌ను అల్వాల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. బ్రాంచ్ ద్వారా రుణాలు, డిపాజిట్ పథకాలు అందిస్తామన్నారు.
MNCL: మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తానే పారిశుధ్య కార్మికుడిగా మారాడు MCPIU జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్. బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్ లో నెల రోజులుగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో దోమలు, ఈగలతో వార్డ్ కంపు కొడుతుందని వెంకటేష్ అన్నారు. మున్సిపల్ సిబ్బంది స్పందించక పోవడంతో తానే డ్రైనేజీ శుభ్రం చేశానన్నారు.