• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

600 ఎకరాల భూకబ్జాపై ఎమ్మెల్యే ధ్వజం

MBNR: బీఆర్ఎస్ నేత ఒకరు ఎస్సీ, ఎస్టీలకు చెందిన 600 ఎకరాల భూమిని కబ్జా చేశారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సోమవారం ఆరోపించారు. కొండకల్, మోకిల ప్రాంతాల్లో 1,100 ఎకరాల గిరిజనుల భూములు కొట్టేసిన వారు త్వరలోనే జైలుకు వెళ్తారని హెచ్చరించారు. త్వరలోనే వీటికి సంబంధించిన ఆధారాలు బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.

February 24, 2026 / 08:50 AM IST

బాలానగర్‌లో పెరిగిన మొబైల్ వాడకం.. అశ్రద్ధ చేయకండి!

MDCL: ప్రస్తుత డిజిటల్ యుగంలో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ చేయొద్దని డాక్టర్ సువర్ణ, డాక్టర్ రమణ మహర్షి తెలిపారు. బాలానగర్, ప్రకాష్ నగర్, సూరారం సహా అనేక ప్రాంతాల్లో వివిధ ప్రజారోగ్య సంస్థలు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాయి. వృద్ధులు, యుక్త వయసు, చిన్నపిల్లలు సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షలు చేసుకోవాలన్నారు.

February 24, 2026 / 08:50 AM IST

నేడు బిఆర్ఎస్ నాయకుల సమావేశం

KMR: నిజాంసాగర్ మండలం చిన్నకొడప్గల్ గ్రామంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో నేడు బిఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే హనుమాన్ సిండే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిఆర్ఎస్ మద్దతు సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 08:47 AM IST

విద్యార్థులకు ప్రిన్సిపాల్ సూచన

MNCL: ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణరావు సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులకు హాల్ టికెట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయని, పరీక్షా ప్యాడ్, హాల్ టికెట్, పెన్నులను తెచ్చుకోవాలని సూచించారు.

February 24, 2026 / 08:44 AM IST

ఏప్రిల్ మొదటి నెలలో ఎయిర్‌పోర్ట్ ప్రారంభం..?

వరంగల్లోని మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటనలో PM మోదీ మామునూర్ విమానాశ్రయంతో పాటు కాజీపేట అయోధ్యపురంలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గీసుగొండ మెగా టెక్స్‌టైల్ పార్కులను ప్రధాని ప్రారంభిస్తారని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

February 24, 2026 / 08:43 AM IST

దూడను చంపిన చిరుత పులి

NZB: నవీపేట్ మండలంలోని అబ్బపూర్ (ఎం)లో ఆదివారం అర్ధరాత్రి చిరుతపులి సంచారం భయాందోళన రేకెత్తించింది. బెల్లిడిగే అబ్బన్న అనే రైతు పశువుల పాకపై దాడి చేసిన చిరుత, ఒక దూడను చంపేసింది. సోమవారం ఉదయం యజమాని గమనించి అధికారులకు ఫిర్యాదు చేశారు. బీట్ అధికారులు జాహుర్, సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అడుగుజాడలను సేకరించారు.

February 24, 2026 / 08:42 AM IST

రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆదిలాబాద్ విద్యార్థుల ప్రభంజనం

ADB: తొలి రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాల గల పిల్లల క్రీడా పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. వివిధ విభాగాల్లో సమిష్టి ప్రతిభతో మొత్తం 35 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్‌ను కైవసం చేసుకున్నారు. కలెక్టర్ రాజర్షిషా విజేత విద్యార్థులను, వారికి శిక్షణనిచ్చిన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.

February 24, 2026 / 08:41 AM IST

నేడు ఆర్టీసీ సంఘాల చలో సెక్రటేరియట్

HYD: నేడు ఆర్టీసీ సంఘాలు చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన కాకుండా సొంతంగా సమకూర్చుకోవడం, ఉద్యోగులపై పని ఒత్తిడి, ఖాళీల భర్తీ తదితర డిమాండ్లతో నిరసన వ్యక్తం చేయనున్నాయి.

February 24, 2026 / 08:39 AM IST

ట్రాక్టర్ ఢీకొని యువకుడి మృతి

WNP: ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పాతపల్లికి చెందిన కిషోర్ కుమార్ (25) దుర్మరణం చెందాడు. సోమవారం సాయంత్రం అయ్యవారిపల్లె నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు సరోజినీ ఆసుపత్రికి, అనంతరం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

February 24, 2026 / 08:36 AM IST

కాకతీయ యూనివర్సిటీ పీజీ పరీక్షలు వాయిదా

HNK: KU పరిధిలో ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించాల్సిన పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడినట్లు KU పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. నాన్-ప్రొఫెషనల్ కోర్సులు (MA, MSC, M.COM)తో పాటు ప్రొఫెషనల్ కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

February 24, 2026 / 08:35 AM IST

‘మహిళల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం’

SRCL: మహిళల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని బీజేపీ మండల అధ్యక్షులు విజేందర్ అన్నారు. చందుర్తి మండలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల యోజన పథకంలో అర్హులైన లబ్దిదారులు మండలం లోని గ్రామాలకు చెందిన 50 మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్తయ్య, తిరుపతి నాయక్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:32 AM IST

ఉమ్మడి జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం

సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేటతో పాటు పలు మండలాల్లో అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాత్రి ఒక్కసారిగా వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వేసవి మొదలై ఎండలు ముదురుతున్న తరుణంలో ఈ అకాల వర్షాలు రైతులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

February 24, 2026 / 08:32 AM IST

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

MBNR: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జయప్రద సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్పీ ఎంపీసీఎస్, బీఎస్పీ ఎంజెడ్ సి, బీఎస్పీ బీజెడ్ సి, బీకాం( సీఏ) కోర్సులు ఉన్నాయన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థునులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

February 24, 2026 / 08:30 AM IST

‘పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలి’

ASF: పండుగలను మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో రంజాన్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసమును ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ప్రార్థన సమయాలలో ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

February 24, 2026 / 08:29 AM IST

పసుపు రైతులకు ముఖ్య గమనిక

NZB: అకాల వర్షాల కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు పసుపు రైతులకు పలు సూచనలు చేశారు. మంగళవారం పసుపు వ్యాపార లావాదేవీలు మూసివేయనున్నట్లు తెలిపారు. యార్డులో సరైన స్థలం లేకపోవడంతో మంగళవారం పసుపు రైతులు ఎవరూ తీసుకురావద్దని సూచించారు. బుధవారం నుంచి కనుగోళ్లు యథావిధిగా ఉంటాయన్నారు.

February 24, 2026 / 08:27 AM IST