• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

PUలో ప్లేస్‌మెంట్స్.. 9 మంది ఎంపిక

MBNR: మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో HDYకి చెందిన ఓ సంస్థ గురువారం నిర్వహించిన ప్రాంగణ ఎంపీకలలో 9 మంది ఎంపికైనట్టు యూనివర్సిటీ ఉపసంచాలకులు జి.ఎన్.శ్రీనివాస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా వి.సీ మాట్లాడుతూ.. ఎంపికైన సంస్థలో బాధ్యతగా పనిచేసి యూనివర్సిటీ పేరు నిలబెట్టాలన్నారు. ఎంపికైన వారికి ప్రోహిబిషన్‌లో జీతం రూ. 1.8 లక్షలు ఉంటుందన్నారు.

March 5, 2026 / 02:12 PM IST

‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి’

ADB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ ఆదేశించారు. గురువారం ఉట్నూర్‌లోని క్యాంపు కార్యాలయంలో డీటీడీఓ, ఏటీడీవోలు, హెచ్‌డబ్ల్యుఓల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99పై సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యచరణపై కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.

March 5, 2026 / 02:11 PM IST

‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి’

ADB: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అన్ని ఆశ్రమ పాఠశాలలో నిర్వహించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్ ఆదేశించారు. గురువారం ఉట్నూర్‌లోని క్యాంపు కార్యాలయంలో డీటీడీఓ, ఏటీడీవోలు, హెచ్‌డబ్ల్యుఓల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99పై సమావేశం నిర్వహించారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యచరణపై కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.

March 5, 2026 / 02:11 PM IST

మోడల్ స్కూల్ దరఖాస్తుల గడువు పొడగింపు

SRD: రాయికోడ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తు గడువును మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు రాయికోడ్ MEO జీ. నర్సింలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అయన సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 5, 2026 / 02:11 PM IST

వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన మేఘారెడ్డి

WNP: రాజ్యసభ సభ్యుడిగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేరును AICC ఖరారు చేసింది. ఈ క్రమంలో గురువారం అసెంబ్లీ సెక్రటరీ వేం నరేందర్ రెడ్డి తన నామినేషన్ సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, pcc ప్రెసిడెంట్, మంత్రులు, MLA లతో కలిసి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి పాల్గొని ఆయనకు అభినందనలు తెలియజేశారు.

March 5, 2026 / 02:11 PM IST

పదవికి రాజీనామా చేసిన వేం నరేందర్ రెడ్డి

MHBD: సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయనను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆయన తన రాజీనామా లేఖను CSకు సమర్పించారు. అనంతరం హైదరాబాదులో రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కేసముద్రం మండలానికి చెందిన నేతకు ఈ అరుదైన అవకాశం దక్కడంతో ఉమ్మడి జిల్లాలో సంబరాలు హోరేత్తాయి.

March 5, 2026 / 02:08 PM IST

‘లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలి’

SRCL: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నాలుగో వార్డులో ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యాడ మానస ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటుండగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టారో ఆరా తీశారు.

March 5, 2026 / 02:03 PM IST

‘అత్యవసరమైతేనే ప్రయాణాలు కొనసాగించాలి’

MNCL: గల్ఫ్ దేశాలకు కార్మికులు అత్యవసరమైతేనే ప్రయాణాలు కొనసాగించాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య కోరారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు వచ్చేవారు, పోయేవారు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. యుద్ధం దృష్ట్యా ఏజెంట్లు పెద్ద మొత్తంలో విమాన చార్జీలను వసూలు చేసే అవకాశం ఉందన్నారు.

March 5, 2026 / 02:00 PM IST

మను సింఘ్వీ నామినేషన్‌ దాఖలులో మంత్రి కోమటిరెడ్డి

NLG: రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ తన మొదటి సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సింఘ్వీ సతీమణి కూడా హాజరయ్యారు. నామినేషన్ అనంతరం మంత్రి కోమటిరెడ్డి సింఘ్వీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

March 5, 2026 / 02:00 PM IST

ఈ నెల 7న స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ

KMM: ఖమ్మం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 7న గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ గావిస్తారు. అనంతరం రాత్రి 7:30 గంటలకు కొండపై స్వాతి నక్షత్ర జ్యోతిని వెలిగిస్తారని ఆలయ ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు.

March 5, 2026 / 01:47 PM IST

రేపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం

BDK: సుజాతనగర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం హెల్త్ మిషన్ 100లో భాగంగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి రమేష్ కుమార్ గురువారం తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, పల్మనాలజీ, డెంటల్ విభాగాలకు చెందిన నిపుణులు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.

March 5, 2026 / 01:46 PM IST

బ్రెయిలీ విభాగాన్ని ప్రారంభించిన గ్రంథాలయ ఛైర్మన్

NZB: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అందుల సౌకర్యార్థం బ్రెయిలీ విభాగాన్ని గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా అంధులకు సంబంధించిన పుస్తకాలతో పాటు కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. అంధులు వినియోగించుకుని విజ్ఞానవంతులు కావాలని తెలిపారు.

March 5, 2026 / 01:45 PM IST

బీచ్యతండాలో సీసీ రోడ్లు ప్రారంభం..

NLG: దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో MGNREGS నిధుల నుంచి మైనంపల్లి గ్రామానికి రూ.5 లక్షలతో సీసీ రోడ్డు పనులను మంజూరయ్యాయి. ఈ సందర్భంగా బీచ్యతాండలో మైనంపల్లి సర్పంచ్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్ గురువారం అధికారులు, సభ్యులతో కలిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాలునాయక్, పంచాయతీ రాజ్ డీఈ లింగారెడ్డి, ఏఈ శంకర్ పాల్గొన్నారు.

March 5, 2026 / 01:45 PM IST

కోహెడలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

SDPT: కోహెడ మండలం తగ్గళ్లపల్లిలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల అనంతరం స్వామివారు గ్రామంలోకి తిరిగి విచ్చేసిన సందర్భంగా భక్తులు డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలను గ్రామంలోని ఆలయంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 5, 2026 / 01:39 PM IST

అయిజలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారుల ఇబ్బంది

GDWL: అయిజ పట్టణంలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ప్రధాన కూడళ్లలో తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బస్టాండ్ ఎదురుగా దుకాణాల ముందు వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేయడం సమస్యకు కారణమవుతోంది. వాహనాలు వరుస క్రమంలో నిలిపి ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు సహకరించాలని డ్రైవర్లు కోరుతున్నారు.

March 5, 2026 / 01:39 PM IST