• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మల్కాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ

BHNG: ఎం తుర్కపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో శుక్రవారం సర్పంచ్ సొన్నాయిల రఘు అంగన్వాడీ కేంద్రంలో అకస్మాత్తుగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం పాలు, గుడ్లు, మురుకులు, పెడుతున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోషక పదార్థాలను పిల్లలకు టైం ప్రకారం పెట్టాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలయ్య , వార్డు వార్డు మెంబర్లు, పాల్గొన్నారు.

February 27, 2026 / 01:17 PM IST

‘రోడ్డు మరమ్మతులు చేపట్టాలి’

VKB: నవాబ్‌పేట్ మండలం ఏక్మామిడి గ్రామ సమీపంలో రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిపివేశారు. కంకర తేలిపోయి వాహనదారులకు ప్రయాణం నరకంగా మారింది. ‘అర్ధాంతరంగా వదిలేసిన రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలి. ప్రయాణ సౌకర్యం కల్పించాలని అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరుతున్నాం’ అని వాహనదారులు వ్యాఖ్యానించారు.

February 27, 2026 / 01:17 PM IST

స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలు: DYSO పవన్ కుమార్

NZB: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్, హన్మకొండ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి మొదలైంది అన్ని DYSO పవన్ కుమార్ తెలిపారు. 3వ తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. మార్చి 13 నుంచి 17 వరకు మండల, మార్చి 28 నుంచి ఏప్రిల్ 1 వరకు జిల్లా, ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకు రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి అన్ని అన్నారు.

February 27, 2026 / 01:15 PM IST

చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చడం అక్రమం: కంచర్ల

నల్లగొండ ప్రకాశం బజార్‌లో చిరువ్యాపారుల తొలగింపును మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముందస్తు నోటీసులు లేకుండా షాపులు కూల్చడం దుర్మార్గమని, అధికారుల తోపులాటలో గాయపడ్డ పండ్ల వ్యాపారి అమీర్‌ను ఆయన శుక్రవారం పరామర్శించారు. ప్రభుత్వం చిరువ్యాపారులకు నష్టపరిహారం చెల్లించి, శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 01:15 PM IST

రూల్స్ జానతా నై.. ‘సిండికేట్’గా నొక్కేశారు..!

HYD: హైదరాబాద్ మహానగర జలమండలి అంతర్గత ఆడిట్ విభాగం రూ. 450 కోట్ల వ్యయంలో జరిగిన తేడాలను గుర్తించింది. ముఖ్యంగా మీటర్ల కొనుగోలులో టెండర్ నిబంధనలను ఒక నిర్దిష్ట కంపెనీకి అనుకూలంగా మార్చినట్లు (Tailor Made Conditions) తేలింది. నిబంధనల ప్రకారం కనీసం మూడు కంపెనీలు పోటీ పడాలి, కానీ ఇక్కడ ‘సిండికేట్’ గా ఏర్పడి రూల్స్‌ను గాలికొదిలేశారు.

February 27, 2026 / 01:12 PM IST

‘మొబైల్ ఫోన్ పట్ల అశ్రద్ధ వహిస్తే భద్రతకు భంగం’

NRML: పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్ల పట్ల అశ్రద్ధ వహిస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మొబైల్ ఫోన్లను త్వరగా ట్రేస్ చేసి స్వాధీనం చేసుకోవడానికి CEIR వెబ్‌సైట్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. శుక్రవారం వారు ఎస్పీ కార్యాలయంలో బాధితులకు వాళ్ల పోగొట్టుకున్న ఫోన్లను అందజేశారు.

February 27, 2026 / 01:10 PM IST

పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన ఏఎస్పీ

SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం అదనపు ఎస్పీ చంద్రయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో వసతులను పరిశీలించారు. విద్యార్థులకు డెస్కులు, మంచినీటి, ఫ్యాన్లు అన్ని వసతులు ఉన్నాయని చీఫ్ సూపరింటెండెంట్ మోహన్ కుమార్ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.

February 27, 2026 / 01:10 PM IST

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

KMM: ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఆకస్మికంగా మృతి చెందినట్లు సమాచారం. మృతుడి వ్యక్తిగత సమాచారాలు అందలేదని, గుర్తు తెలియని కారణంగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిస్తే రైల్వే జీఆర్పీ అధికారులను సంప్రదించాలని సూచించారు.

February 27, 2026 / 01:08 PM IST

నేడు నర్సంపేటలో ‘డయల్ యువర్ డీఎం’

WGL: ప్రయాణికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నర్సంపేట ఆర్టీసీ డిపోలో నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్య క్రమం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ ఫిర్యాదులు, సలహాలను తెలియజేయాలని డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి తెలిపారు. 7382926166, 9989038476కు ఫోన్ చేసి బస్సుల రాకపోకలు, సౌకర్యాలపై మాట్లాడాలని ఆమె కోరారు.

February 27, 2026 / 01:08 PM IST

‘శిక్షణతోనే వార్డుల అభివృద్ధి’

KMR: వార్డు సభ్యులు శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ వార్డులను అభివృద్ధి పథంలో నడిపించాలని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ సూచించారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు.

February 27, 2026 / 01:05 PM IST

‘సమస్యల పరిష్కారంపై దృష్టి’

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 5, 11, 13 వార్డులలో వారు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సమస్యలు, మంచినీటి సరఫరా లోపాలు, డ్రైనేజీ, నాలాల క్లీనింగ్ పరిశీలించారు.

February 27, 2026 / 01:05 PM IST

అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన

JGL: రాయికల్ మండలం కిష్టంపేటలో రూ.12 లక్షల నిధులతో నిర్మించనున్న అంగన్వాడీ నూతన భవనానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామస్థాయి సంక్షేమ సేవలకు అంగన్వాడీ కేంద్రాలు కీలకమని, మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజా గౌడ్, ఉపసర్పంచ్ చాంద్ పాషా, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు.

February 27, 2026 / 01:05 PM IST

ఆపదలో అండ.. రక్తదానం..!

KMR: ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ జిల్లా రక్తదాతల సేవా సమితి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజయ్య కు ‘బీ పాజిటివ్’ రక్తం అవసరమవడంతో, సమితి సభ్యుడు పుండరీకాక్ష వెంటనే స్పందించి రక్తదానం చేశారు. మానవత్వాన్ని చాటుకున్న దాతకు సమితి నిర్వాహకులు పాల్గొన్నారు.

February 27, 2026 / 01:03 PM IST

ధర్పల్లిలో ఇసుక వేలం వాయిదా

NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జరగాల్సిన ఇసుక బహిరంగ వేలం అనివార్య కారణాల వల్ల రద్దయినట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. తహసీల్దార్ శాంత అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సుమారు 200 ట్రాక్టర్ల ఇసుకను ఈరోజు వేలం వేయాల్సి ఉండగా,  మరో రోజున వేలం ఉంటుందన్నారు.

February 27, 2026 / 01:03 PM IST

13 ఏళ్ల కలను నెరవేర్చిన ఎంపీ కొండా

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (నావంధీగి) రైల్వే స్టేషన్‌లో హుబ్లీ ట్రైన్ ఆపాలని 13 ఏళ్లగా కలగా మిగిలిన సమస్యను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృషితో వారి కల నేటితో నెరవేరింది. ఎంపీ కోరిక మేరకు కేంద్ర రైల్వే శాఖ ఉత్తర్వులతో ఇవాళ హుబ్లీ రైలును బషీరాబాద్‌లో ఆపారు. ఎంపీతో పాటు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రైల్లో హైదరాబాద్ వరకు ప్రయాణించారు.

February 27, 2026 / 01:03 PM IST