• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గోదావరి నీటి విడుదల..!

SRPT: యాసంగి సీజన్ కుగాను జిల్లాకు వారబందీ విధానంలో ఇస్తున్న గోదావరి నీటిని మంగళవారం సాయంత్రం పెంచారు. నీటిని 1,613 క్యూసెక్కుల నుంచి 1,750 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీళ్లు చేరేందుకు ఈసారి అవకాశం ఉన్న మేర ఎక్కువ నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు.

February 25, 2026 / 06:44 AM IST

లక్ష్మీనారసింహుడికి విశేష పూజలు

SRPT: మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం సాయంత్రం అర్చకులు విశేషపూజలు నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయంలో లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ, హోమశాలలో నిత్యాగ్నిహోత్రి, మూలవిరాటు పంచామృతాభిషేకం, జరిపించారు. లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవసం వాదం చేపట్టారు.

February 25, 2026 / 06:41 AM IST

మతిస్థిమితం కోల్పోయి బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

KMM: మానసిక స్థితి సరిగా లేక బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. SI హరిత తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు కప్పలబంధం రోడ్డులో నివాసం ఉంటున్న వేనేపల్లి సత్యనారాయణ (47) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే బావిలోకి దూకి ప్రాణాలు విడిచాడు.

February 25, 2026 / 06:39 AM IST

నాగర్ కర్నూల్ ఘటనకు ఖండిస్తూ.. కొవ్వొత్తుల ర్యాలీ

NZB:  ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన అమానుష ఘటనలో రెండు నెలల పసికందు మరణించిన ఘటనను ఖండిస్తూ.. తెలంగాణ యూనివర్సిటీ అంబేద్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీలో ర్యాలీ చేపట్టి పసికందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఏఐ రాజ్యమేలుతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు.

February 25, 2026 / 06:38 AM IST

‘ఇంటర్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి’

PDPL: ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్, రవాణా సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీ హర్ష, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:38 AM IST

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: మంత్రి

WNP: అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ఉదయం వేళల్లో గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తిలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చేరువగా ఉండి సేవలు అందించాలని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:37 AM IST

దట్టమైన అడవిలో 15 ఏళ్ల వనవాసం

 BDK: అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పాత గోగులపూడి గ్రామంలో నివసిస్తున్న ఆ కుటుంబం దీనస్థితి ఇది. చుట్టూ క్రూరమృగాలు దట్టమైన అడవి జనసంచారానికి 10 కిలోమీటర్ల దూరం అయినా సరే, ఆ అడవినే నమ్ముకుని గత 15 ఏళ్లుగా ఒకే ఒక కుటుంబం జీవనం సాగిస్తోంది. దాత రమావత్ అనిష్ సుమారు 15 వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, ఇచ్చారు.

February 25, 2026 / 06:36 AM IST

ఇంటర్ పరీక్షా ఏడు కేంద్రాలు ఏర్పాటు..!

RR: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో షాద్ నగర్‌లో మొత్తం 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు 3,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

February 25, 2026 / 06:36 AM IST

దర్గా భవన నిర్మాణానికి విన్నపం

NGKL: రంగాపూర్ హజ్రత్ నిరంజన్ షావలి దర్గాలో నూతన సమఖానా భవనం నిర్మించాలని దర్గా కమిటీ ఛైర్మన్ రఫీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజ్మత్ ఉల్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

February 25, 2026 / 06:34 AM IST

బూర్గుల ఆసుపత్రి వైద్యుడిగా రఘురాం నియామకం

RR: ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ రాఘవేందర్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని బదిలీ ఉత్తర్వులు మూడు వారాల క్రితమే పంపగా.. ఉత్తర్వులు తీసుకోకుండా కాలయాపన చేశారు. ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో నూతన వైద్యుడిగా డాక్టర్ రఘురాంను నియమించగా.. ఆయన నిన్న ఆసుపత్రిలో రిపోర్ట్ చేశారు .

February 25, 2026 / 06:31 AM IST

ప్రోసిడింగ్ మ్యాపింగ్ త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

NRPT: జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రతీ ఇంటికి వెళ్లి కచ్చితమైన ఓటరు గుర్తింపుతో ప్రోసిడింగ్ మ్యాపింగ్, ఎలక్టోరల్ మ్యాపింగ్ చేపట్టాలని వారం రోజుల్లో ఈ ప్రక్రియను 80 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటరు నమోదు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు.

February 25, 2026 / 06:31 AM IST

డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

KNR: భద్రతపై అవగాహన కల్పించే ‘అరైవ్ అలైవ్’లో భాగంగా ఈ నెల 27న వాహన చోదకులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కరీంనగర్ కమిషనరేట్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రమాదాల నివారణలో కంటిచూపు కీలకమని, ఆర్టీసీ, ఆటో, ఇతర వాహన డ్రైవర్లు పోలీసు ప్రధాన కార్యాలయం పక్కన గల అస్త్ర కన్వెన్షన్ హాల్లో వినియోగించుకోగలరు.

February 25, 2026 / 06:30 AM IST

నేటి నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు

MBNR: జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనునట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. పరీక్షల కోసం జిల్లాలో మొత్తంగా 35 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో 20 ప్రభుత్వ కళాశాలలు కాగా 15 ప్రైవేట్ కళాశాలలన్నారు. 10859 ఇంటర్ మొదటి సంవత్సరం, 11025 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయబోతున్నారన్నారు.

February 25, 2026 / 06:27 AM IST

నేషనల్ టాలెంట్ సెర్చ్‌లో విద్యార్థుల మెరుపులు

NGKL: అపెక్స్ నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్షలో అచ్చంపేట ఓ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అర్పిత్ కృష్ణ (నేషనల్ ర్యాంక్-3), రాకేష్ (స్టేట్ ర్యాంక్-2)తో పాటు రూపేష్, రిషిక్, సుష్మ జోనల్ స్థాయిలో ర్యాంకులు సాధించారు. విద్యార్థుల విజయంపై పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

February 25, 2026 / 06:26 AM IST

మంజీరాలో అర్ధరాత్రి ఇసుక దందా..!

MDK: పాపన్నపేట మంజీరా నదీ తీరంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతుంది. ఎనికపల్లి, చిత్రలా, గాజులగూడెం పరిధిలో రాత్రి 11 గంటల తర్వాత నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చీకటి పడగానే ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ కరువైందని మండిపడుతున్నారు.

February 25, 2026 / 06:24 AM IST