BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా ఎపిడెమిక్ బృందం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భక్తుల భారీ రద్దీ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు. జాతరకు తరలివచ్చిన భక్తులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్య బృందం సూచించారు.
WNP: దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే కీలక నిర్ణయాన్ని ఆమోదం తెలిపినట్లు వనపర్తి మహిళా సంక్షేమ శాఖ అధికారి సుధారాణి తెలిపారు. ప్రస్తుతం 50% రాయితీ ఇస్తున్న ఈ సదుపాయం ఇకపై ఉచితంగా లభించనున్నట్లు తెలిపారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న బస్సు సర్వీసులో దివ్యాంగులు కూడా ఉచిత ప్రయాణం అనుమతి ఇస్తారన్నారు.
WGL: నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన తొమ్మిదవ వార్డ్ సభ్యుడు బుజ్జి బిచ్య నాయక్ సోమవారం TPCC సభ్యులు రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ ఛైర్మన్ హరీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరినట్లు బిచ్య నాయక్ వెల్లడించారు. అనంతరం రంజిత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
BHNG: ఎంపీ చామల కిరణ్ కుమార్‌ను గచ్చిబౌలిలో పోచంపల్లి మున్సిపల్ ఛైర్మన్ తడక వెంకటేశ్వర్లు, వైస్ ఛైర్మన్ కొయ్యడ రజిని శ్రీనివాస్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటూ అభివృద్ధికి పాటుపడాలని చామల వారికి సూచించారు.
SDPT: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయని సిద్దిపేట డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. బొప్పాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ సాయంతో నేరగాళ్లను త్వరగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు.
WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు బాలామృతం, గుడ్లు సోమవారం పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ రాపాక పద్మ బ్రహ్మచారి. ఆమె మాట్లాడుతూ.. పిల్లలను ప్రతిరోజూ అంగన్వాడికి పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆశా వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండల ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా గాజుల లింగన్న గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జన్నారంలోని ప్రెస్ క్లబ్ లో నూతన కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా లింగన్న గౌడ్, జాడి వెంకట్‌లను ఎన్నుకున్నారు. ప్రస్తుత అధ్యక్షులుగా ఉన్న చిలువేరు నరసయ్యను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
KMM: కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం పథకాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ ఐతగాని వెంకటరమణ నాగేశ్వరరావు, వార్డు సభ్యులు పెండ్ర అంజయ్య, ఐతగాని నవీన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌తో కలిసి మెనూ ప్రకారం భోజనం, కూరలు ఉన్నాయా అని వాటిని పరిశీలించారు.
JGL: జిల్లాలో హోలీ పండుగను ప్రజలు సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇతర మతాల వారిని గౌరవిస్తూ, మతసామరస్యంతో హోలీ పండుగ జరుపుకోవాలన్నారు. హోలీ పండుగ వేళ ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామన్నారు.
KMM: బీజేపీ సీనియర్ నాయకులు, సత్తుపల్లి వాజ్ పేయిగా ప్రజల్లో ప్రసిద్ధి చెందిన చెక్క మధుసూదన్ రావు సోమవారం సత్తుపల్లిలో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావుతో సహా పార్టీ శ్రేణులు సంతాపం ప్రకటించారు. మధుసూదన్ రావు మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
NLG: చింతపల్లి మండలం గొడుకొండ్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాదేపల్లి పులిరాజ్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం పులిరాజ్ గౌడ్‌ను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
SRD: ఆయా పథకాల కింద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఖేడ్‌లో ఎమ్మెల్యే సంజీవరెడ్డి సోమవారం అందజేశారు. మండల పరిధిలోని అనంతసాగర్ లక్ష్మీకి కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేశారు. అదే విధంగా అరె మారుతి రావుకు మంజూరైన CMRF రూ.60 వేల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ పాటిల్, నాగిరెడ్డి, శివరెడ్డి, లోకేష్ రెడ్డి ఉన్నారు.
PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన మొదటి సంవత్సరం గణితం/బాటని/ పొలిటికల్ సైన్స్ పరీక్షకు 97% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్ విద్యాధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 5780 మంది పరీక్షకు హాజరు కావలసి ఉండగా, 5613 మంది హాజరయ్యారు. మొత్తం 167 మంది గైర్హాజరయ్యారు.
ఆదిలాబాద్: జిల్లాలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా సందర్భంగా వన్ టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 10న ఏఆర్ హెడ్ క్వార్టర్స్ జరగనున్న ఈ జాబ్ మేళాలో 50కిపైగా కంపెనీలు పాల్గొని 2000కుపైగా ఉద్యోగాలు కల్పించనున్నాయి. నిరుద్యోగులు గూగుల్ ఫారమ్QR Code లింక్ ద్వారారిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
WNP: చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 3 వ తేదీన శ్రీరంగపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేసి, తిరిగి రాత్రి 8 గంటలకు తెరుస్తారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యావచనం, స్నాపన తిరుమంజనం, హోమాలు నిర్వహించనున్నారు. భక్తులు ఈ సమయాలను గమనించి సహకరించాలని కోరారు.