• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కన్నెపల్లి వాడలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా

ASF: కౌటాల మండలం పాత కన్నెపల్లి వాడలో కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు పడుతున్న ఇబ్బందులను సర్పంచ్ మోర్లే పార్వతి పరిష్కరించారు. సర్పంచ్ ఆదేశాల మేరకు ఆదివారం ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేసి ప్రజల దాహార్తిని తీర్చారు. మిషన్ భగీరథ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులతో మాట్లాడుతున్నామని, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆమె తెలిపారు.

March 1, 2026 / 05:01 PM IST

వైభవంగా శ్రీ వీరన్న భద్రకాళిస్వామి బ్రహ్మోత్సవాలు

BHNG: రామస్వామి తండాలో శ్రీ వీరన్న భద్రకాళి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ దిరావత్ సునీత వెంకటేష్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సమీప గ్రామాల సర్పంచులు తిరుమణి నాగరాజుగౌడ్, చెలివేరు పావని ఇంద్రసేనారెడ్డి, మాజీ MPTC మచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

March 1, 2026 / 05:00 PM IST

మాదిగ అమరవీరులకు ఘన నివాళి

NZB: మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పూలాంగ్ చౌరస్తాలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టి మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. మాదిగ ఉపకులాల అభివృద్ధి కోసం అసువులు బాసిన వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

March 1, 2026 / 05:00 PM IST

‘కొత్త రోడ్డు వేశారు.. సూచిక బోర్డులు మరిచారు’

VKB: దుద్యాల మండలం హంసన్‌పల్లి నుంచి బొంరాస్‌పేట మండలం లింగన్‌పల్లి మీదుగా హైదరాబాద్ బీజాపూర్ 163వ జాతీయ రహదారి వరకు ఇటీవల డబుల్ రోడ్డు వేశారు. కాగా, మూలమలుపులు ప్రమాదకరంగా మారినా అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

March 1, 2026 / 04:59 PM IST

JBS నుంచి గోదావరిఖని వెళ్లే బస్సుల లిస్ట్

HYDలో జూబ్లీ బస్టాండ్ నుంచి గోదావరిఖని వెళ్లే బస్సుల లిస్టును ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. మధ్యాహ్నం 3:51, సాయంత్రం 4:23, 4:26, రాత్రి 11:18 గంటలకు జూబ్లీ బస్టాండ్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని, అటువైపు వెళ్లే ప్రయాణికులందరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఉదయం సమయంలో 9:45, మధ్యాహ్నం 12:15, 12:45 గంటలకు సైతం ఉన్నాయి.

March 1, 2026 / 04:57 PM IST

వైభవంగా పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణం

SDPT: దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో ఆదివారం పెద్దమ్మ పెద్దిరాజు కళ్యాణ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, భక్తులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

March 1, 2026 / 04:55 PM IST

అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం

VKB: పరిగిలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న 39వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 1, 2026 / 04:49 PM IST

బీర్‌లో చెత్త దర్శనం.. వినియోగదారుల ఆగ్రహం

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమృత బార్ అండ్ రెస్టారెంట్‌లో కల్తీ బీర్ ఘటన కలకలం రేపింది. ఆదివారం బీర్ సీసాలో చెత్త కనిపించడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఒకే బాటిల్‌పై రెండు వేర్వేరు కంపెనీల పేర్లు ఉండటం అనుమానాలకు దారితీసింది. ఈ ఘటనపై ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, బార్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

March 1, 2026 / 04:48 PM IST

మహిళా పోలీసులకు ఉచిత ఆరోగ్య శిబిరం

JGL: జగిత్యాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్పీవీ టీకా ద్వారా సర్వైకల్ క్యాన్సర్ నివారణ సాధ్యమని వైద్యులు వివరించారు.

March 1, 2026 / 04:44 PM IST

ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం: సర్పంచ్

MHBD: బయ్యారం మండల కేంద్రంలో మెడ్ ప్లస్ మెడికల్ షాపును ఆదివారం బయ్యారం SI తిరుపతి, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి-కిషన్ నాయక్, జెగ్గు తండా సర్పంచ్ బొల్లి జయంతి-వెంకటకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతి మాట్లాడుతూ.. మండలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

March 1, 2026 / 04:42 PM IST

‘విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తాయి’

MDK: నర్సాపూర్ BVRIT కళాశాలలో నిర్వహించిన భగ్గిలా పోటీలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని మహేందర్ సూచించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు.

March 1, 2026 / 04:41 PM IST

శంకర్‌పల్లి మున్సిపల్ నూతన ఛైర్మన్‌కు సన్మానం

శంకర్పల్లి మున్సిపల్ నూతన చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ను ఆయన స్నేహితులు (1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ ) ఈరోజు ఘనంగా సన్మానించారు. తమ స్నేహితుడు మున్సిపల్ చైర్మన్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

March 1, 2026 / 04:39 PM IST

ఉచిత కంటి వైద్య శిబిరం

NZB: కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూర్‌లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 100 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్‌ అందజేశారు. మోతి బిందు ఉన్న 22 మంది రోగులను కంటి ఆపరేషన్స్‌కు ఎంపిక చేసి గురువారం ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ లుక్క గంగాధర్ పాల్గొన్నారు.

March 1, 2026 / 04:38 PM IST

ఆత్మ కమిటీ రైతుల అభివృద్ధికి కీలకపాత్ర పోషించాలి: సీతక్క

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో నూతన ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆత్మ చైర్మన్ కార్ల అరుణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, కమిటీ సభ్యులకు ప్రమాణం చేయించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆత్మ కమిటీ రైతుల అభివృద్ధికి కీలక పాత్ర పోషించాలని, రైతుల సమస్యలపై సమిష్టిగా నిర్ణయాలు తీసుకుని సహకరించాలని సూచించారు.

March 1, 2026 / 04:35 PM IST

గోపాలపురంలో ఉచిత మంచి నీటి ప్లాంట్ ప్రారంభం

BHNG: తుర్కపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్వో మంచినీటి ప్లాంట్ను సర్పంచ్ పుట్ట సాయిలు ప్రారంభించారు. దాత గుర్రాల నాగేశ్వరరావు రెడ్డి ఆర్థిక సహకారంతో ఈ వాటర్ ఫిల్టర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. గ్రామస్తుల తాగునీటి కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిన దాతను ఈ సందర్భంగా అభినందించారు.

March 1, 2026 / 04:34 PM IST