• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

SRCL: బోయినిపల్లి మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, భూ భారతి రిజిస్ట్రేషన్ గది, కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కార్యాలయానికి వచ్చే వారికి సేవలు అందించాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న వారికి అందుబాటులో ఉండాలన్నారు.

March 4, 2026 / 06:02 PM IST

మక్కలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: హరీశ్ రావు

SDPT: మక్కలకు కనీస మద్దతు ధర (MSP) చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని సాగు చేసిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని విమర్శించారు. సకాలంలో యూరియా ఇవ్వడంలో విఫలమైన రేవంత్ సర్కార్, పంట కోత దశకు వచ్చినా పెట్టుబడి సాయం అందించలేకపోవడం దారుణమని మండిపడ్డారు.

March 4, 2026 / 06:01 PM IST

నిర్మించారు.. ప్రారంభించడం మరిచారు

ASF: కౌటాల మార్కెట్‌లో స్వచ్ఛభారత్ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గతేడాది నిర్మాణం పూర్తయినా నేటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ప్రజలు,వారసంతకు వచ్చే వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో కనీసం నీటి సౌకర్యం, మూత్రశాలలు లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. అధికారులు స్పందించి మరుగుదొడ్లను ప్రారంభించాలన్నారు.

March 4, 2026 / 06:01 PM IST

స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

HYD: కాచిగూడలోని శ్రీ ఉత్తరాది మఠంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగవైభవంగా ప్రారంభమయ్యా యి. ఉదయం స్వామివారికి అంకురార్పణం, పుణ్యాహవచనంతో ప్రత్యేక పూజలు చేసి, యాగం చేసి బ్రహ్మోత్సవాలను వేద పండితులు ప్రారంభించారు. 6వ తేదీన శుక్రవారం శ్రీ స్వామివారి కళ్యాణం ఉంటుందని జయ తీర్థచార్య తెలిపారు.

March 4, 2026 / 06:01 PM IST

దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు: అ. కలెక్టర్

ASF: జిల్లా కలెక్టరేట్లో బుధవారం దివ్యాంగుల హక్కులపై సమీక్ష సమావేశం జరిగింది. మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ డేవిడ్ హాజరై మాట్లాడారు. దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేయూత పింఛన్ కేంద్రాల్లో తాగునీరు,సదరం శిబిరాల్లో వీల్చైర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

March 4, 2026 / 06:01 PM IST

ముగిసిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ

NZB: రాష్ట్రస్థాయి శిక్షణా శిబిరం విజయవంతంగా ముగిసిందని కార్పొరేషన్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. ఫిబ్రవరి 21న ప్రారంభమైన ఈ శిబిరంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. శిక్షణలో భాగంగా చరఖాతో దారం తీయడం నేర్పించారన్నారు. చివరి రోజు రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

March 4, 2026 / 06:00 PM IST

మక్తల్‌ యువతకు అభ్యాస్ కార్యక్రమం

NRPT: మేరా యువభారత్ ఆధ్వర్యంలో మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామంలో బుధవారం యువ మండల వికాస్ అభ్యాస్ నిర్వహించారు. జిల్లా కోఆర్డినేటర్ అనిల్ గౌడ్, నేతాజీ వచన సంఘం అధ్యక్షుడు చెన్నకేశవులు మాట్లాడారు. గ్రామ యువ కమిటీలను మేరా యువభారత్‌తో అనుసంధానం చేసి, యువతకు ప్రోత్సాహం, ఉద్యోగ, క్రీడా అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.

March 4, 2026 / 06:00 PM IST

‘ముస్లింలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి’

NLG: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లింలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని 30వ డివిజన్ ఇన్‌ఛార్జ్ షేక్ జాంగిర్ బాబా డిమాండ్ చేశారు. షాదీ ముబారక్‌తో పాటు తులం బంగారం అందించాలని, ఇమామ్, మౌజంల వేతనాన్ని రూ. 6 నుంచి రూ. 12 వేలకు పెంచాలని కోరారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

March 4, 2026 / 06:00 PM IST

కలెక్టర్‌ను కలిసిన మాజీ ఛైర్మన్

MDK: జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమ సింగ్‌ను మున్సిపల్ మాజీ ఛైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్ శివ రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణాభివృద్ధికి సహకరించాలని వారు కలెక్టర్‌ను కోరారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్, డీఎస్‌వో నిత్యానందను కలిసి రైస్ మిల్లర్ల సమస్యలపై చర్చించారు.

March 4, 2026 / 05:52 PM IST

‘పరీక్షల వేళ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

MHBD: పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో సూచించారు. బుధవారం ఆయన జడ్పీ సీఈవో పురుషోత్తంతో కలిసి గుమ్ముడూరు ఎంజేపీ పాఠశాల, కంకర బోర్డు జెడ్పీ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు.

March 4, 2026 / 05:45 PM IST

ఐడియా వెబ్ సైట్ ప్రారంభం

HYD: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యు కేషన్ అసోసియేషన్(IDEA ) వెబ్సైట్ ideaindia.netను ప్రారంభించారు. ఈ నెల 25, 26 తేదీలలో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

March 4, 2026 / 05:45 PM IST

ఇంటి నిర్మాణాన్ని పరిశీలించిన కార్యదర్శి

NZB: రెంజల్ మండలం బోర్గం గ్రామంలోని ప్రకృతి వనానికి వెళ్లే దారిలో అక్రమంగా ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు తన దృష్టికి రావడంతో అట్టే స్థలాన్ని గ్రామ కార్యదర్శి రాణి బుధవారం పరిశీలించారు. గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్న వారికి నోటీసులను పంపారు. ఇట్టి విషయంపై అధికారులకు నివేదికను పంపనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

March 4, 2026 / 05:43 PM IST

ఎంపీ వద్దిరాజును సత్కరించిన ఏదులాపురం కౌన్సిలర్

KMM: ఏదులాపురం 12వ వార్డు కౌన్సిలర్ మొర్రిమేకల సత్యనారాయణ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎంపీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన సత్యనారాయణను ఎంపీ అభినందించారు. వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు.

March 4, 2026 / 05:41 PM IST

కళాకారులకు వరం.. పీఎం విశ్వకర్మ మేళా

NLG: చేతివృత్తుల కళాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 6 నుంచి 8 వరకు ఎస్బీఆర్ (SBR) ఫంక్షన్ హాల్లో ‘పీఎం విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్’ నిర్వహిస్తోంది. ఎంఎస్ఎంఈ (MSME) ఆధ్వర్యంలో జరిగే ఈ మూడు రోజుల ప్రదర్శనలో లబ్ధిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించి, విక్రయించుకోవచ్చు. ఈ అవకాశాన్ని కళాకారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

March 4, 2026 / 05:40 PM IST

గద్వాల్ -ఆత్మకూరు రహదారిపై మట్టి గతుకులు

GDWL: గద్వాల్ నుంచి ఆత్మకూరు వెళ్లే ప్రధాన రహదారి ప్రయాణికులకు చుక్కలు చూపుతోంది. దెబ్బతిన్న రోడ్డుకు తాత్కాలికంగా మట్టి వేసి చేతులు దులుపుకోవడంతో వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో, మట్టి కొట్టుకుపోయి గుంతలు మళ్లీ పెద్దవిగా తయారయ్యాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.

March 4, 2026 / 05:40 PM IST