• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

హరీష్ రావును కలిసి సిరిగిరి విద్యాసాగర్

BHNG: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుని ఆలేరు BRS నియోజకవర్గ నాయకులు సిరిగిరి విద్యాసాగర్ బుధవారం ఘట్కేసర్ ORR రోడ్డులో కలిసి స్వాగతం పలికారు. రానున్న కాలంలో BRS ప్రభుత్వం వస్తుందని ఆయన కార్యాకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో BRS యువత, తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 07:17 PM IST

విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి..!

MDCL: అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి సంబంధించిన సీట్లను 210 నుంచి 500 వరకు పెంచింది. కావున జిల్లా SC కులాలకు చెందిన అర్హులైన విద్యార్థులు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఈనెల 31 వరకు ఈ-పాస్ వెబ్‌సైట్ https://www.tgepass.cgg.gov.in ద్వారా అప్లై చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ తెలిపారు.

March 4, 2026 / 07:17 PM IST

‘దాతల సేవలు అభినందనీయం’

PDPL: పత్తిపాక పాఠశాలలో దాతల సేవలు అభినందనీయమని కాంప్లెక్స్ హెచ్ఎం నరేందర్ రావు అన్నారు. బుధవారం ప్రాథమిక పాఠశాలలో ప్రజాప్రతినిధి ఆకుల రాజేందర్ 97 మంది విద్యార్థులకు రూ.20,000 షూస్ అందజేశారు. కార్యక్రమానికి నరేందర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని ఆయన కోరారు.

March 4, 2026 / 07:16 PM IST

ట్రాఫిక్ PSలు ఏర్పాటు చేయాలని వినతి

SRCL: సిరిసిల్ల వేములవాడ పట్టణాలలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాకల పర్శరాములు జిల్లా ఎస్పీ మహేష్ గితేకు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల, పుణ్యక్షేత్రమైన వేములవాడలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందన్నారు. దీంతో అధికారులు స్పందించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు.

March 4, 2026 / 07:11 PM IST

బతుకమ్మ ఘాట్ ఏర్పాటు కోసం చర్యలు

BDK: గుండాల బతుకమ్మ ఘాట్ అభివృద్ధి, ఊర చెరువుపై మినీ ట్యాంక్ బండ్, లైటింగ్ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇరిగేషన్ డీఈ వెంకటేష్, ఏఈ పృథ్వి ఊర చెరువు కట్టను, బతుకమ్మ ఘాట్‌ను సర్వే చేశారు. మినీ ట్యాంక్ బండ్, లైటింగ్ నిర్మాణం, బతుకమ్మ ఘాట్‌ను అభివృద్ధి చేసి ఆహ్లాదకర వాతావరణం అందిస్తామని వారు తెలిపారు.

March 4, 2026 / 07:10 PM IST

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

MDK: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జిల్లా వ్యాప్తంగా 5201 ఇందిరమ్మ ఇండ్లకు గాను రూ. 111 కోట్లు చెల్లించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ తెలిపారు. కౌడిపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన పనులు ప్రారంభించి, నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.

March 4, 2026 / 07:09 PM IST

తాటి చెట్టుపై నుంచి పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు

NLG: దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన సామల ఎర్రయ్య (56) కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా కాలు జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.

March 4, 2026 / 07:09 PM IST

ఆదర్శ గ్రామాల నిర్మాణమే లక్ష్యం: కలెక్టర్

SRPT: గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతన సర్పంచుల శిక్షణలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

March 4, 2026 / 07:04 PM IST

ఈ మండలాల్లో రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్

MDK: జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల కారణంగా ఈనెల 5, 6న పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలు,మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లోని 80 ఆవాసాలకు నీటి సరఫరా ఉండదన్నారు. ముందస్తు సమాచారాన్ని సర్పంచ్లకు చేరవేశామని, ప్రజలు పొదుపుగా వాడుకోవాలి అన్నారు.

March 4, 2026 / 07:03 PM IST

ముందస్తు ప్రణాళికతో పుష్కరాలు: MRO

MNCL: లక్షెట్టిపేట పట్టణ శివారులోని గోదావరి నది తీరంలో జరిగే పుష్కరాల కోసం ప్రతిష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని స్థానిక MRO దిలీప్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ లతో కలిసి గోదావరి తీర ప్రాంతాన్ని సందర్శించారు. పుష్కరాలకు వేలాది మంది భక్తులు తరలి వస్తారని తెలిపారు.

March 4, 2026 / 07:02 PM IST

మెగా రిక్రూట్‌మెంట్ అభినందనీయం: కలెక్టర్

SRD: నిరుద్యోగ అభ్యర్థుల కోసం మహేంద్ర పరిశ్రమ మెగా రిక్రూట్‌మెంట్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిక్రూట్‌మెంట్ బ్రోచర్లను బుధవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

March 4, 2026 / 07:01 PM IST

పరిశ్రమల పనితీరుపై విద్యార్థుల క్షేత్ర పర్యటన

KNR: ఇల్లందకుంట పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పారిశ్రామిక సంస్థల సందర్శనలో భాగంగా జమ్మికుంటలోని కాటన్ జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం, అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. కాటన్ మిల్లులో ఉత్పత్తి విధానాలు, KVKలో సేంద్రియ ఎరువుల తయారీ, పంటల వైవిధ్యం గురించి తెలుసుకున్నారు.

March 4, 2026 / 07:01 PM IST

ఈనెల 7న మెగా జాబ్ మేళా

కామారెడ్డి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ దోమకొండ పోర్టు ఆధ్వర్యంలో ఈనెల 7న దోమకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. 30కి పైగా ప్రముఖ కంపెనీలు ప్రత్యక్ష ఇంటర్వ్యూలతో పాల్గొంటున్నాయి. కావున నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరై ఉద్యోగమేలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 4, 2026 / 07:00 PM IST

జడ్చర్లలో ప్రభుత్వ అధ్యాపక సంఘం డైరీ ఆవిష్కరణ

MBNR: డా. బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ అధ్యాపక సంఘం డైరీ, క్యాలెండర్‌ను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ. సుకన్య బుధవారం ఆవిష్కరించారు. అధ్యాపకులు నిరంతరం కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు రాఘవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డా.నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

March 4, 2026 / 07:00 PM IST

ఇంటి వద్దకే భద్రాద్రి రాముల వారి తలంబ్రాలు

ADB: శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించిందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టామన్నారు. భక్తులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.

March 4, 2026 / 07:00 PM IST