KNR: పేదల సంక్షేమం కోసం ఆరు గ్యారంటీ అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపెల్లి ఎంపీ వంశీ కృష్ణ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పల్లెల అభివృద్ధిలో ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు.
ADB: జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును మున్సిపల్ ఛైర్మన్ అనూష, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు మున్సిపల్ సమస్యలు విన్నవించారు. ఆదిలాబాద్ మునిపల్ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లను మంజూరు చెయ్యాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.
SDPT: జగదేవ్పూర్ మండల కేంద్రంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు వివరించేందుకు రైతు వేదికలో పోస్ట్ బడ్జెట్ వెబినార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఉదయం11:00 గంటల నుండి సాయంత్రం5:00 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
BDK: అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. శుక్రవారం అన్ని శాఖల జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్షా నిర్వహించారు.
HNK: పట్టణ కేంద్రంలోని వికాస్ నగర్ కాలనీలో శుక్రవారం శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథిగా WGL పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
NZB: జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కళాశాలల బైకడ్ చేయడంలో భాగంగా శుక్రవారం NZB బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో గిరిరాజ్ కళాశాల బైకడ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నావాతే ప్రతాప్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని కళాశాలలో స్వచ్ఛందంగా బంద్ చేశారు.
KMM: గ్రామాలలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు మార్చి 6 నుంచి 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లో భాగస్వామ్యం కావాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం రఘునాథపాలెం రైతువేదిక నందు మండల సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, వివిధ శాఖల మండల అధికారులకు అవగాహన కల్పించారు.
MHBD: తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని HYDలో శుక్రవారం కేసముద్రం మండలానికి చెందిన నాయకుడు సమ్మి గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వేం నరేందర్ రెడ్డి రాజ్యాంగ బద్ధమైన పదవిలోకి వెళ్లడం మా ప్రాంతానికి గర్వకారణమని సమ్మి గౌడ్ అన్నారు.
WGL: నల్లబెల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సుడోమోనాస్, ట్రైకోడెర్మా విరిడే, పీఎస్బీ (భాస్వరం కరిగించే ఎరువు)లను 50 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు AO రజిత తెలిపారు. ట్రైకోడెర్మా 1 కిలో ప్యాకెట్ పూర్తి ధర రూ.100 కాగా, సబ్సిడీ తర్వాత రైతులు రూ.50 మాత్రమే చెల్లిస్తే సరిపోతుందన్నారు. రైతుల సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NGKL: జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చెత్తను ఊడ్చారు. ’99 రోజుల ప్రజా పాలన’లో భాగంగా మార్చి 6 నుంచి 15 వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక శుభ్రత డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచడంతో పాటు, పెండింగ్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో PG, ఇంటిగ్రేటెడ్ PG మొదటి సెమిస్టర్, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,292 మంది విద్యార్థులకు గాను 1,220 మంది హాజరు కాగా, 72 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు.
MDK: తూప్రాన్ మండలం నాగులపల్లి వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. నాగులపల్లి గ్రామానికి చెందిన ఏశబోయిన రాములు అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను రవాణా చేస్తుండగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద పట్టుకున్నట్లు వివరించారు. ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు.
MBNR: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అధికారులకు సూచించారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలోభాగంగా ప్రభుత్వాసుపత్రి వద్ద నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..99రోజుల కార్యక్రమంలో నిర్వహించే ప్రతి అంశాన్ని విజయవంతం చేయాలని కోరారు.
NRML: జిల్లాలోని అన్ని డీడీవోలు తమ పరిధిలో ఉన్న సీపీఎస్ ఉద్యోగుల డెమోగ్రాఫిక్ వివరాలను సరిచూడాలని జిల్లా డీటీవో సరోజ సూచించారు. మొబైల్ నంబర్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, నామినీ వంటి వివరాలు సరైనవిగా ఉన్నాయో లేదో CRA NSDL Protean సైట్‌లో డీడీవో లాగిన్ ద్వారా పరిశీలించి అవసరమైతే సవరించుకోవాలని శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
GDWL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం వేడుకలు జరిగాయి. జిల్లాలో మహిళా పోలీస్ విభాగం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని ఎస్పీ ప్రశంసించారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందిని ప్రత్యేకంగా గౌరవించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు.