BHNG: చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం నూతన భవనానికి మార్చినట్లు తహశీల్దార్ వీరాబాయి తెలిపారు. పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన కొత్త కార్యాలయంలో సోమవారం నుంచి సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. రెవెన్యూ పనుల కోసం వచ్చే ప్రజలు పాత భవనానికి కాకుండా కొత్త భవనానికే రావాలని ఆమె సూచించారు. మార్పును గమనించాలని తెలిపారు.
SRD: జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 123 పరీక్షా కేంద్రాల్లో 24,658 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాస్తున్నారని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరీక్ష ఏర్పాట్లపై సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.
ASF: రెబ్బెన మండలంలో ఇవాళ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. చేతికి వచ్చిన పత్తి పంట తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకస్మికంగా కురిసిన ఈ వర్షం వల్ల పంట నేలపాలైందని, పెట్టుబడి కూడా దక్కేలా లేదని అన్నదాతలు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన పత్తిని కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
WGL: నల్లబెల్లి GP ఆవరణంలో ఇవాళ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాంబారావ్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యమకారులను కనీసం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి వారికి బాసటగా నిలుస్తానని ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ADB: తలమడుగు మండలం కజ్జర్లలో ఉపాధి హామీ నిధులు రూ. 25 లక్షలతో మంజూరైన కల్వర్టు, టాయిలెట్ రూమ్స్ పనులకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, సర్పంచ్ ఎల్మా నారాయణరెడ్డి ఈ పనులను ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబన్న, దేవారెడ్డి, గంగన్న, కమలాకర్ తదితరులున్నారు.
JGL: ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెగడపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ నరేశ్ కోరారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా ‘ఏఎన్సీ డే’ క్లినిక్ నిర్వహించి, వారికి రక్త పరీక్షలు చేసి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.
MLG: జిల్లా కేంద్రంలోని పోట్లపూర్ గ్రామంలో నూతన CC రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బానోత్ రవి చందర్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
GDWL: గట్టు మండలం చాగదోన గ్రామానికి చెందిన రంగస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. అయిజలోని బ్యాంకులో ఆయన చేయించుకున్న PMSBY బీమా పథకం ద్వారా రూ.2 లక్షల మంజూరయ్యాయి. ఈ మొత్తాన్ని బ్యాంకు మేనేజర్ రుద్ర గౌడ్ సోమవారం మృతుడి భార్య మాధవికి అందజేశారు. ఈ నగదును పిల్లల భవిష్యత్తుకు వాడాలని సూచించారు.
KMM: సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ సోమవారం సీపీఎస్ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. కూసుమంచి మండలం, జీళ్ళ చెరువు కాంప్లెక్స్ మీటింగ్‌లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్లెకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. వెంటనే బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
NRML: మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మెన్ పడిగెల భూషణ్ అన్నారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు కడెం మండలం లింగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మహిళ సంఘ భవనం (వీవో) భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంజిత్, వార్డు సభ్యులు రాజు, ఏఎంసీ డైరెక్టర్ నారాయణ ఉన్నారు.
NRPT: నాగర్ కర్నూల్‌లో చిన్నారి మృతి ఘటనకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ, మున్సిపాలిటీ పాత బస్టాండ్ చౌరస్తాలో సీపీఐ మండల నాయకులు, రజక సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. అనంతరం చౌరస్తా వరకు ర్యాలీ చేసి ధర్నా చేశారు. సీపీఐ నాయకుడు హనుమంతు సమగ్ర దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు.
NLG: కుల దురహంకారం తో పసి కందును కాలుతో తొక్కి ప్రాణాలు తీసిన కుమ్మెర ఘటన దోషులను శిక్షించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రుద్రారపు పెద్దులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాలలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపి కుల దురహంకారుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
KMR: కామారెడ్డి పట్టణాన్ని పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఈ కార్య క్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
MBNR: స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా అని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మోడల్ శ్రీనివాస్ సాగర్ అన్నారు. సోమవారం సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా బీసీ సమాజ్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాబా తన పాటలతో అంటరానితనాన్ని రూపుమాపేందుకు ఎంతో కృషి చేశారన్నారు.
MDK: ప్రజల దూర భారాన్ని, ప్రజల సమయాన్ని తగ్గించడం కోసమే మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. నిజాంపేటలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రాల్లో ప్రజావాణిని మరింత బలోపేతం చేస్తామని, ప్రజలదూర భారాన్ని, ప్రయాణ బత్యాల్ని, సమయాభావాన్ని తగ్గించడం కోసమే ఏర్పాటు చేశామన్నారు.