NGKL: వెల్దండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి, MLA కసిరెడ్డి నారాయణరెడ్డి హాజరై గురువారం ఇంటిని ప్రారంభించారు. MLA మాట్లాడుతూ..అర్హులైన పేదవాడికి గృహ నిర్మాణ పథకం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో 195 అబాండెడ్ వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ప్రకటించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 26 ప్రకారం ఈ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన యజమానులకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకోవడానికి ఆరు నెలల గడువు ఉంటుందని, ఈలోపు క్లెయిమ్ చేసుకోకపోతే బహిరంగ వేలం వేస్తామని ఆయన పేర్కొన్నారు.
నల్గొండ: కేతపల్లి మండలం బండపాలెం గ్రామంలోని శ్రీ సీతారాముల స్వామి దేవస్థానానికి నూతన ఛైర్మన్‌గా మారం మీనారెడ్డిని ఎమ్మెల్యే వేముల వీరేశంను ఏకగ్రీవంగా నియమించారు. మార్చిలో జరిగే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తానని మీనారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.శ్రీనివాస్, సర్పంచ్ పెండ్యాల శ్రీనివాసరావు, వి.రాము, కోటిరెడ్డి, సురేష్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
MDCL: పీర్జాదిగూడ చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పర్యవేక్షించారు. గుర్రపు డెక్క వెంట వెంటనే తొలగించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ని ఆయన ఆదేశించారు. గుర్రపు డెక్కల వలన దోమలు పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేయాలని అన్నారు.
KMM: బోనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026” నిర్వహించారు. వైరా ఏసీపీ సారంగపాణి వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రాణనష్టం, కుటుంబాలపై పడే ప్రభావం మరియు చట్టపరమైన చర్యల గురించి ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.
SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి, రూ.22,500 కోట్ల బడ్జెట్‌తో పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం హుజూర్ నగర్‌లోని రామస్వామి వద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్ల పెండింగ్ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంత్ లాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు.
NGKL: కుమ్మెర మల్లన్న జాతర ఘర్షణపై గురువారం జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ స్పందించారు. రెండు వర్గాల మధ్య జరిగిన దాడులపై కేసులు నమోదు చేసి, ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. శిశువు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అవసరమైతే మర్డర్ సెక్షన్లు చేరుస్తామన్నారు.
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూలులో ఇవాళ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ.. త్వరలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని, పరీక్షలు అంటే భయం లేకుండా ధైర్యంగా రాయాలని సూచించారు.
HYD: హరిద్వార్‌లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన ఓల్డ్ బోయినపల్లికి చెందిన ఎం.తనయను MLA వివేకానంద అభినందించారు. తనయ ఇటీవల జిల్లా స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం, CM పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం MLA క్యాంపు కార్యాలయంలో ఆమెను MLA సన్మానించారు.
SRPT: కుట్టు మిషన్ ఆవిష్కరించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన విలియమ్స్ హో జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 28న నిర్వహించే టైలర్స్ డేను విజయవంతం చేయాలని జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు బాజీ ఉల్లా తెలిపారు. గురువారం స్థానిక గాంధీ పార్క్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టైలర్ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ, సంఘటితంగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
KMM: పట్టణంలో వెలుగుమట్ల ప్రాంతంలో పది సంవత్సరాల క్రితం పేద ప్రజలు భూధన భూమిలో ఇళ్లు నిర్మాణం చేసుకొని ఇక్కడ జీవిస్తున్నారు. ఈనెల 24 తేదీన యంత్రాలతో అధికారులు కూల్చేశారు. గురువారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు వినతి పత్రం అందజేసి ఇళ్లు కూల్చివేత తిరిగి ప్రత్యామ్నాయమై ఏర్పాటు చేయాలని కోరారు.
HNK: పరకాల వ్యవసాయ మార్కెట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్, 5,000 మెట్రిక్ టన్నుల గోదాం చుట్టూ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పరకాల మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, రైతు సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను కల్పిస్తుందని అన్నారు.
ADB: ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనథ్ మండలంలోని దీపాయిగూడ గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలందరికీ సంక్షేమం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
MHBD: కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ బానోత్ సునీత, వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ అల్లం రమ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MHBD MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ హాజరై వారిని శాలువతో ఘనంగా సన్మానించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని MLA సూచించారు.
MLG: తాడ్వాయి మండలం మేడారంలో పలు గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రి సీతక్క చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లును త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని, పూర్తయిన ఇళ్లుకు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్ తదితరులు ఉన్నారు.