»Nothing Has Changed Jaragandi Jaragandi Trolling Again On The Song
Jaragandi: ఏ మారలేదు.. జరగండి.. జరగండి.. సాంగ్ పై మళ్లీ ట్రోలింగ్!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుంచి చరణ్ బర్త్ డే గిఫ్ట్‌గా.. జరగండి జరగండి సాంగ్ బయటికి వచ్చేసింది. మామూలుగానే శంకర్ సినిమాల్లో సాంగ్స్ ఓ రేంజ్లో ఉంటాయి. మరి జరగండి జరగండి సాంగ్ పై ట్రోలింగ్ ఎందుకు?
Nothing has changed.. Jaragandi.. Jaragandi.. Trolling again on the song!
Jaragandi: రామ్ చరణ్‌తో శంకర్ సినిమా చేస్తున్నాడు అనగానే.. చరణ్ డ్యాన్స్, ఆ సాంగ్స్ విజువల్ గ్రాండియర్ గురించి అంతకు మించి అనేలా ఊహించుకున్నారు మెగా ఫ్యాన్స్. పైగా.. శంకర్ పాటల కోసమే దాదాపు 90 కోట్ల వరకు ఖర్చు చేశారనే టాక్ బయటికి రావడం.. తమన్ అదిరిపోయే ట్యూన్సన్ ఇచ్చానని చెప్పడం.. గేమ్ చేంజర్ ఆల్బమ్ పై అంచనాలు నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయాయి. అందుకు తగ్గట్టే.. తాజాగా ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి సాంగ్ రిలీజ్ అయింది. ఇక ఈ సాంగ్ చూసిన తర్వాత శంకర్ మార్క్ క్లియర్‌గా కనిపిస్తోంది. విజువల్ పరంగా వావ్ అనేలా ఉంది సాంగ్. చరణ్, కియారా జోడి సూపర్‌గా ఉంది. కానీ ఇందులో విజువల్ ట్రీట్ తప్పితే కొత్తగా ఏం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. గతంలోనే ఈ సాంగ్ లీక్ అయింది.
లీక్ అయినప్పుడే చాలా మంది ఈ ట్యూన్‌ని వినేశారు. అప్పట్లో ఈ సాంగ్ పై కాస్త గట్టిగానే ట్రోలింగ్ జరిగింది. లీక్ అయిన వెంటనే.. అసలు ఈ సాంగ్ గేమ్ చేంజర్ సినిమాలోనిదేనా? అనే డౌట్స్ కూడా వచ్చాయి. దీంతో ఇది బేసిక్ వర్షన్ మాత్రమే.. ఫైనల్ వెర్షన్ ఇంకా రెడీ కాలేదని.. సాంగ్ రిలీజ్‌ను వాయిదా వేశారు మేకర్స్. ఇక ఫైనల్ వెర్షన్ సాంగ్‌లో చాలా మార్పులు ఉంటాయని అనుకున్నారు. కానీ తీరా ఈ సాంగ్ బయటికొచ్చాక చూస్తే.. దీనికంటే లీక్డ్ సాంగ్‌నే బెటర్‌గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు.. ఈ అఫీషియల్ సాంగ్‌లో ఏం మార్చారు? లీక్డ్ సాంగ్ లాగే యాజ్‌టీజ్‌గా ఉందని అంటున్నారు. కేవలం ఈ పాటలో సింగర్స్ మాత్రమే మారినట్టున్నారు. ఈ పాటకు ఆనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ ఆలపించారు. మొత్తంగా ఈ పాట విషయంలో తమన్ మీద మళ్లీ ట్రోలింగ్ మొదలైంది. కొందరు ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాలోని ‘సుర్రో సుర్రో’కు సాంగ్‌కు కాపీ.. అంటూ ట్రోల్ చేస్తున్నారు.