»Nomination Of Bandaru Prakash As Deputy Chairman Of Legislative Council
Bandaru Prakash : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండారు ప్రకాశ్ నామినేషన్
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండారు ప్రకాశ్ (Bandaru Prakash) ముదిరాజ్ పేరును బీఆర్ఎస్( Brs) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (Cmkcr) ఖరారు చేశారు.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండారు ప్రకాశ్ (Bandaru Prakash) ముదిరాజ్ పేరును బీఆర్ఎస్( Brs) పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (Cmkcr) ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నామినేషన్ వేయాల్సిందిగా ప్రకాశ్ కు సీఎం సూచించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత పార్టీ నాయకులను సీఎం తెలిపారు. తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరించిన ఎమ్మెల్సీ నేతి విద్యా సాగర్ పదవీకాలం 2012, జూన్ 3న పూర్తైంది. దీంతో అప్పటినుంచి డిప్యూటీ చైర్మన్ (Deputy Chairman )పదవి ఖాళీగా ఉంది.
ఈ క్రమంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు శుక్రవారం నోటిఫికేషన్ (Notification) విడులైంది. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు (Ministers) హరీశ్ రావ్, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి బీఆర్ఎస్ కు దక్కటం ఖాయమనే చెప్పొచ్చు .బండా ప్రకాశ్ 2018 మార్చిలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, ఎంపీగా ఆరేళ్ల పదవీకాలం పూర్తికాకముందే 2021 నవంబర్ ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎంపికయ్యారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్ (December) మొదటివారంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఖాళీగా ఉన్న చీఫ్విప్తో పాటు, విప్ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం.మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయ్యే రెండు స్థానాలను భర్తీ చేయనున్నారు. మార్చి 29తో సభ్యుల పదవీ కాలం పూర్తి కానుండటంతో కొత్త వారి ఎన్నికకు షెడ్యూల్ ఖరారు చేశారు. స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేసే సభ్యుల పదవీ కాలం మే 1వరకు ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ శాసనమండలి( Legislative Council)లో ఖాళీ అయ్యే మూడు పట్టభద్రుల (graduates) నియోజక వర్గాలతో పాటు రెండు ఉపాధ్యాయ నియోజక వర్గాలను భర్తీ చేయాల్సి ఉంది. దీంతో పాటు ఎనిమిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలను కూడా భర్తీ చేస్తారు.తెలంగాణలో మహబూబ్నగర్-రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న కాతేపల్లి జనార్థన్ రెడ్డి (Katepalli Janarthan Reddy) పదవీ కాలం కూడా ముగియనుంది. తెలంగాణలోని హైదరాబాద్ లోకలబాడీ ఎమ్మెల్సీగా ఉన్న సయ్యద్ అమిన్ ఉల్ హసన్ జఫ్రీ (Hasan Jaffrey) పదవీ కాలం ముగిసింది. త్వరలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల శాసన మండళ్లలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీన గడువుగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వరకు గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు (Withdrawal) ఫిబ్రవరి 27వ తేదీని గడువుగా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 21నాటికి ఎన్నికల ప్రక్రియను ముగిస్తారు.