»Revanth Is Contesting Against Cm Kcr In Kamareddy Congress Is The Third List With 16 Candidates
Kamareddyలో సీఎం కేసీఆర్‌పై రేవంత్ పోటీ.. 16 మందితో కాంగ్రెస్ మూడో జాబితా
శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ 16 మందితో మూడో జాబితా విడుదల చేసింది.కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది.
కామారెడ్డి నియోజకవర్గం (Kamareddy Constituency) లో సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢీకొననున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 16 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితాను సోమవారం రాత్రి రిలీజ్ చేసింది. ఇందులో కామారెడ్డి స్థానానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది.నిజామాబాద్ అర్బన్ సీటును సీనియర్ లీడర్ షబ్బీర్ అలీకి పార్టీ కేటాయించింది. గతంలో ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల స్థానాలను అధిష్ఠానం మార్చింది. గతంలో బోథ్ (ఎస్టీ) స్థానంలో వెన్నెల అశోక్, వనపర్తి(Vanaparthi)లో మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. తాజా ప్రకటనతో బోథ్‌లో ఆడె గజేందర్, వనపర్తిలో తూడి మేఘారెడ్డి బరిలో దిగనున్నారు.ఇక చెన్నూరు నుంచి జీ.వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది.
మరోవైపు పొత్తులో భాగంగా కొత్తగూడెం(Kothagudem)సీటును సీపీఐకి కేటాయించింది. తాజా జాబితాతో మొత్తం 114 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది. తుంగతుర్తి, సూర్యపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.మిర్యాలగూడ నుంచి తమ అభ్యర్థిగా జూలకంటి రంగారెడ్డిని ప్రకటించింది. అయినా మిర్యాలగూడ(Miryalaguda)కు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు. సీపీఎంతో ఇంకా పొత్తు కుదిరే అవకాశాలున్నాయని కాంగ్రెస్ (Congress) భావిస్తున్నందునే ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచినట్లు సమాచారం. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డిల మధ్య తీవ్రపోటీ నెలకొనడంతో సూర్యాపేట స్థానాన్ని పెండింగ్‌లో ఉంచారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిన తర్వాతే అక్కడ అభ్యర్థిని ప్రకటించాలని అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. సూర్యాపేటపై.. తుంగతుర్తి టికెట్ ఆధారపడి ఉండటంతో దాన్ని కూడా పెండింగ్‌లో ఉంచారు. చార్మినార్ (Charminar) సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌కు ఎంఐఎం టికెట్ ఇవ్వలేదు. ఆయన కాంగ్రెస్ గూటికి చేరితే బరిలో దించాలనే యోచనతో.. పార్టీ ఆ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది.
మూడో విడత అభ్యర్థుల జాబితా ఇదే
1. చెన్నూరు – వివేక్ వెంకటస్వామి
2. కామారెడ్డి – రేవంత్ రెడ్డి
3. బాన్సువాడ – ఏనుగు రవీందర్
4. నిజామాబాద్ అర్బన్ – షబ్బీర్ అలీ
5. డోర్నకల్ – రామచంద్రు నాయక్
6. వైరా – రాందాస్
7. ఇల్లందు – కోరం కనకయ్య
8. సత్తుపల్లి – మట్టా రాగమయి
9. అశ్వారావుపేట – ఆదినారాయణ
10. వనపత్తి – మేఘారెడ్డి
11. బోథ్ – గజేందర్
12. జుక్కల్ లక్ష్మీ కాంతారావు
13. కరీంనగర్ – పరుమళ్ల శ్రీనివాస్
14. సిరిసిల్ల – మహేందర్ రెడ్డి
15. నారాయణ ఖేడ్ – సురేష్ షెట్కర్
16. పఠాన్ చెరు – నీలం మధు.