BB7: ఈ సీజన్ నిజంగానే ఉల్టా పల్టా.. అతను రీ ఎంట్రీ..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా.. అంత డిఫరెంట్‌గా జరుగుతోంది. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన ఆట సందీప్ తిరిగి హౌస్‌లోకి రీ ఎంట్రీ అవుతారని తెలుస్తోంది.
BB7: బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన బిగ్ బాస్ సీజన్ ఒక ఎత్తు అయితే, ఈ సీజన్ మరోలా ఉంది. అన్ని సీజన్లు మించి, ఎవరి అంచనాలు అందకుండా, ఈ సీజన్ ని ప్లాన్ చేస్తున్నారు. కాగా, 9వ వారంలో శోభ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఆమెకు అదృష్టం కలిసొచ్చి కెప్టెన్ అయ్యింది. ఎలిమినేషన్ నుంచి కూడా తప్పించుకుంది. ఆమె సేవ్ కావడంతో, తేజ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.
గతంలో ఎలిమినేట్ అయిన చాలా మందిని తేజ నామినేట్ చేయడం విశేషం. ముఖ్యంగా చాలా సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేసేవాడు. పాజిటివ్ వైబ్స్ రాలేదని, నెగిటివ్ వైబ్స్ వచ్చాయని, వాటర్ పోశారని, ఇలా చెప్పి నామినేట్ చేసేవాడు. చివరకు అతను కూడా చాలా సిల్లీ రీజన్‌తో నామినేట్ అయిపోయి బయటకు వచ్చాడు.తేజ ఎలిమినేట్ అయిన తర్వాత నెట్టింట మరో వార్త చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది.
మరోసారి రీ ఎంట్రీ ప్లాన్ చేయాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తోందట. ఇప్పటికే రతిక ను రీఎంట్రీ ద్వారా తీసుకువచ్చారు. ఇప్పుడు సందీప్ మాస్టర్ని మళ్లీ హౌస్ లోకి పంపించాలని బిగ్ బాస్ టీమ్ భావిస్తున్నారని వార్తలు రావడం మొదలయ్యాయి.ఇది జరుగుతుంది అనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే, ఇప్పటికే పది వారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చినా గేమ్‌లో మజా ఉండదు. సందీప్‌కి కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. సందీప్ మీద కూడా అంత మంచి ఇంప్రెషన్ లేదు కాబట్టి, ఇది జరిగే అవకాశం చాలా తక్కువ.ఈ సీజన్ ఉల్టా పల్టా అన్నారు కాబట్టి, జరిగే అవకాశం ఉండొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.