»New Year Sanctions Sanctions On New Year Celebrations In Bhagyanagar
New Year Sanctions: భాగ్యనగరంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
2023కి వీడ్కోలు పలుకుతూ.. 2024 సంవత్సరానికి ఘనస్వాగతం పలకనున్నారు. ఈక్రమంలో భాగ్యనగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. అయితే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించారు.
New Year Sanctions: నగరాలన్ని న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమయ్యాయి. 2023కి వీడ్కోలు పలుకుతూ.. 2024 సంవత్సరానికి ఘనస్వాగతం పలకనున్నారు. ఈక్రమంలో భాగ్యనగరంలో న్యూ ఇయర్ వేడుకలకు ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. అయితే నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు విధించారు. ఫ్లై ఓవర్లు, ఓఆర్ఆర్, పీవీ ఎక్స్‌ప్రెస్‌పై రాకపోకలకు అనుమతి లేదని తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి విమానాశ్రయానికి వెళ్లే వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. విమాన టికెట్ చూపించిన వాళ్లకు మాత్రమే అనుమతి ఇస్తారని తెలిపారు.
రాత్రి 8 గంటల నుంచి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలుంటాయని తెలిపారు. స్టంట్స్, ఓవర్ స్పీడ్ వెళ్లిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్ వాహనాల కోసం ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రగ్స్ విషయంలో పబ్‌ల యాజమాన్యం బాధ్యత వహించాలని తెలిపారు. అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదే విధంగా మూడు కమిషనరేట్ల పరిధిలోని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 అర్థరాత్రి దాటే వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.