»Karnool Mother Drowns Her Younger Children In A Bucket
Karnool: కన్న బిడ్డలను బకెట్లో ముంచి చంపిన తల్లి
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని హాల్వి గ్రామానికి చెందిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను బకెట్ నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Karnool: ఓ కసాయి తల్లి తన ఇద్దరు బిడ్డలను బకెట్ నీటిలో ముంచి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని హాల్వి గ్రామానికి చెందిన రామకృష్ణ, శారద దంపతులకు వెంకటేశ్(3) భరత్(6) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న శారద ఆ చిన్నారులను బకెట్ నీటిలో ముంచింది. దీంతో చిన్నారులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
భర్తతో కలిసి వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అప్పటికే వాళ్లు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వారి మృతదేహాల్ని శవ పరీక్ష నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుమారులను చంపినట్లు తెలిస్తే ఇంట్లో వారు తనని చంపేస్తారనే భయంతో శారద కూడా విషం తాగింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ చిన్నారులను చంపడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.