640 new corona cases have been registered in the india december 22nd 2023
Corona Case : గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి చేరింది. గత 227 రోజుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. శనివారం ఉదయం 8 గంటల నుండి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 841 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో (ఆదివారం ఉదయం 8 గంటల వరకు) మొత్తం ముగ్గురు వ్యక్తులు వైరస్ బారిన పడి మరణించారు.
కేరళ, కర్ణాటక, బీహార్లో ఒక్కొక్కరు మరణించినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 5, 2023 వరకు, దేశంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య రెండంకెలకే పరిమితమయ్యేదని, అయితే కొత్త వేరియంట్ JN.1 వ్యాప్తి, శీతాకాలం కారణంగా, ఇప్పుడు కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
220.67 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ
ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం, కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పటి నుండి 4.5 కోట్ల మంది ప్రజలు వైరస్ బారిన పడ్డారు. 5.3 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు చేరింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.