»Buddha Venkanna 2023 Ended As Jagan Vidyhamsa Nama Year
Buddha venkanna: 2023 జగన్ విధ్యంస నామ సంవత్సరంగా ముగిసింది
వైసీపీ పాలన సరిగ్గా లేదని జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్నారు.
Buddha venkanna: వైసీపీ పాలన సరిగ్గా లేదని జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని బుద్దా వ్యాఖ్యానించారు. 2023 జగన్ విధ్యంస నామ సంవత్సరంగా ముగిసిందన్నారు. 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థులను మార్చాలని జగన్ చూస్తున్నారని.. కానీ ఆయన్నే మార్చాలని ప్రజలు చూస్తున్నారని బుద్దా ఎద్దేవా చేశారు. బలహీన వర్గాల ద్రోహి జగన్ అని దుయ్యబట్టారు.
కొవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. జగన్ ప్రభుత్వాన్ని పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చిపారేస్తారని తెలిపారు. కరోనా వేళ పారిశుద్ధ్య కార్మికులకు ఈ ప్రభుత్వం మాస్క్లు, శానిటైజర్లు కూడా ఇవ్వలేదన్నారు. అప్కాస్ ద్వారా నామమాత్ర జీతాలే ఇస్తున్నారని తెలిపారు. కొన్నిచోట్ల కార్మికులని బెదిరించి, మోసపూరిత హామీలతో పనిచేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలన అనగాని డిమాండ్ చేశారు.