»Minister Ktr Fulfilled The Dream Of A Disabled Person Auto Help
KTR : దివ్యాంగుడి కల నెరవేర్చిన మంత్రి కేటీఆర్.. ఆటో సాయం
ఆపదలో ఉండే వారికి అండగా నిలిచే మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి పెద్ద మనుసు చాటారు. అడిగిన వెంటనే ఆటో అందించి ఓ నిరుపేద దివ్యాంగుడి కలను నెరవేర్చారు. ఎల్లారెడ్డిపేట (YALLAREDDYPET)మండలం నారాయణపూర్ కు చెందిన ఆకారపు నర్సయ్యకు పుట్టుకతోనే రెండు కాళ్లు వంకరపోయాయి.
ఆపదలో ఉండే వారికి అండగా నిలిచే మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి పెద్ద మనుసు చాటారు. అడిగిన వెంటనే ఆటో అందించి ఓ నిరుపేద దివ్యాంగుడి కలను నెరవేర్చారు. ఎల్లారెడ్డిపేట (YALLAREDDYPET)మండలం నారాయణపూర్ కు చెందిన ఆకారపు నర్సయ్యకు పుట్టుకతోనే రెండు కాళ్లు వంకరపోయాయి. ఆయన భార్య కొంత కాలం క్రిందట ఆనారోగ్యంతో మరణించింది.ఇద్దరు కూతుళ్లు మాధూరి, గౌతిమి ఉన్నారు. చేతనైనా పనిజేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. రెండు రోజుల క్రితం మంగళవారం (ఫిబ్రవరి 28న) మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల డే కేర్ (Elderly day care)సెంటర్ ప్రారంభోత్సవానికి రాగా, నర్సయ్య బీఆర్ఎస్ (BRS) సిరిసిల్లజిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సహకారంతో అమాత్యుడిని కలిసి గోడు వెళ్లబోసుకున్నాడు. ఆటో ఇవ్వాలని వేడుకోగా, అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag jayathi)తో మాట్లాడి ఆటో మంజూరు చేయించారు గురువారం ఎల్లారెడ్డిపేట తహసీల్ కార్యాలయం వద్ద కొత్త ఆటోను నర్సయ్యకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యతో కలిసి ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు అందజేశారు.
పేదల బాధను విని స్పందించడంలో రామన్న గుండె చప్పుడయ్యాడని కొనియాడారు. మాట ఇచ్చిన 24 గంటల్లో ఆటోను అందించడం సంతోషకరమని చెప్పారు. ఆటోను అందించడంతో నర్సయ్య ఆనందంలో మునిగిపోయాడు.తన ఇద్దరు కూతుళ్లను ఆటోలో కూర్చోబెట్టుకొని తిప్పాడు. ఇక్కడ సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అపేరా సుల్తానా, ఎస్సీ కార్పొరేషన్ (SC Corporation)ఈడీ వినోద్‌కుమార్, తహసీల్దారు జయంత్ కుమార్, ఎంపీడీవో చిరంజీవి, నాయకులు మాజీద్, రమేశ్, బాల్‌రెడ్డి, ఉదయ్ తదితరులు ఉన్నారు. అన్నా కష్టాల్లో ఉన్నా అనగానే నేనున్నా అంటూ ముందుకు వచ్చి సహాయం చేస్తున్న మంత్రి కేటీఆర్ గొప్ప మనసు చాటుకున్నారని నర్సయ్య (NARASAIAH) సంతోషం వ్యక్తం చేశారు. తన కూతుళ్లను ఆటోలో కూర్చోబెట్టుకొని కొద్దిసేపు తిప్పాడు. ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ.. ‘నా భార్య ఆరు నెలల క్రితం చనిపోయింది.. అప్పటి నుంచి నేను కష్టాల్లో ఉన్నాను. ఇలాంటి సమయంలో మంత్రి కేటీఆర్ అడిగిన 24 గంటల్లోనే నాకు ఆటో ఇప్పిచ్చిండు.. నేను బతికినంత కాలం ఆయనకు రుణపడి ఉంటా.. నాకు సహకరించిన వాళ్లందరికీ నా కృతజ్ఞతలు’ అని అన్నారు.