»A Man Who Drank Urine And Ate Worms Survived For 31 Days
Bolivian Man: మూత్రం తాగి, పురుగులు తిని 31 రోజులు బతికిన వ్యక్తి..ఎక్కడంటే
బొలీవియా(Bolivia)కు చెందిన 30 ఏళ్ల జోనాటన్(Jonathan) సరదాగా వేటకు వెళ్లాలని అనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి జనవరి 25న అమెజాన్ అడవు(Amazon Forest)ల్లో వేటకు వెళ్లాడు. అలా వేటకు వెళ్లిన అతను పర్వత ప్రాంతంలో తప్పిపోయాడు(Missing). స్నేహితుల నుంచి తప్పిపోయి అమెజాన్ అడవు(Amazon Forest)ల్లో చిక్కుకున్నాడు. తనకు తినడానికి, తాగడానికి ఏదీ లేకుండా పోయింది. దీంతో నరకాన్ని చవిచూశాడు. అమెజాన్ అడవుల నుంచి బయట పడే మార్గం తెలియకుండా నెల రోజులకు పిచ్చివాడిలా అయిపోయాడు.
చాలా మంది సరదాగా చేసే కొన్ని పనులు వారిని ముప్పుతిప్పలు పడేలా చేస్తుంటాయి. కొన్ని సమయాల్లో ఆ సరదా పనుల వల్ల ప్రాణాలు కూడా పోతుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి సరదాగా అడవి(Forest)కి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. నెల రోజుల పాటు ఆ అడవిలోనే ఇరుక్కుని నరకం చూశాడు. మూత్రం తాగుతూ(Drinking Urine), పురుగులు తింటూ ప్రాణాలను కాపాడుకుంటూ బతికాడు. చివరికి అతడిని రెస్క్యూ టీమ్(Rescuew Team) కాపాడింది. ఈ సంఘటన బొలీవియా(Bolivia) దేశంలో చోటుచేసుకుంది.
బొలీవియా(Bolivia)కు చెందిన 30 ఏళ్ల జోనాటన్(Jonathan) సరదాగా వేటకు వెళ్లాలని అనుకున్నాడు. తన స్నేహితులతో కలిసి జనవరి 25న అమెజాన్ అడవు(Amazon Forest)ల్లో వేటకు వెళ్లాడు. అలా వేటకు వెళ్లిన అతను పర్వత ప్రాంతంలో తప్పిపోయాడు(Missing). స్నేహితుల నుంచి తప్పిపోయి అమెజాన్ అడవు(Amazon Forest)ల్లో చిక్కుకున్నాడు. తనకు తినడానికి, తాగడానికి ఏదీ లేకుండా పోయింది. దీంతో నరకాన్ని చవిచూశాడు. అమెజాన్ అడవుల నుంచి బయట పడే మార్గం తెలియకుండా నెల రోజులకు పిచ్చివాడిలా అయిపోయాడు.
అమెజాన్ అడవు(Amazon Forest)ల్లో నెల రోజుల పాటు అతను ప్రాణాలతో ఉండటానికి పురుగులు(Worms) తిన్నాడు. గతంలో టీవీ ప్రోగ్రామ్స్ చూడటం వల్ల ఆ నైపుణ్యాలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివరికి రెస్క్యూ టీమ్(Rescuew Team) కంట పడటంతో అతను రక్షించబడ్డాడు. నెల రోజుల పాటు అతను సజీవంగా బతకడానికి తన మూత్రం(Urine) కూడా తాగాడు.
నెల రోజుల పాటు అమెజాన్ అడవుల్లో తనకు దొరికిన కీటకాలు(Insects), వానపాములు తింటూ మూత్రం తాగుతూ బతికాడు. తనను తాను బతికించుకోవడానికి తన రబ్బరు బూట్లలో వర్షపు నీటి(Rain water)ని సేకరించి తాగినట్లు జోనాటన్ తెలిపాడు. 31 రోజుల తర్వాత నకు 300 మీటర్ల దూరంలో రెస్క్యూ టీమ్(Rescuew Team) కనిపించిందని, వారి సాయం కోసం కేకలు వేసి అటువైపు వెళ్లానని, అలా తాను అడవి(Forest)లోని బతికి బయటపడ్డానని జోనాటన్ చెప్పుకొచ్చాడు. నెల రోజుల పాటు అడవిలో మూత్రం తాగుతూ, కీటకాలు తినడం వల్ల తాను 17 కిలోలు తగ్గినట్లు తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగుందని జోనాటన్(Jonathan) వెల్లడించాడు.