»A Hippopotamus Chasing A Lion Drinking Water Viral Video
Viral Video: సింహాన్ని తరిమేసిన హిప్పోపొటామస్
అడవికి రారాజైన సింహంన్ని ఏ నీటి ఏనుగు వెనక్కి తరిమింది. తన పరిధిలో సింహం లేకుండా ఎదిరించిన హిప్పోపొటామస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
సింహం(lion)ఎప్పుడైనా బయపడి వెనక్కి పారిపోవడం చుశారా. చాలా కష్టమనే చెప్పవచ్చు. ఎందుకంటే సింహం ఒక్కసారి వెటాడేందుకు వస్తే 80 కిలీమీటర్ల వేగంతో వచ్చి జంతువును వేటాడి వెంటాడి చంపేస్తుంది. ఆ క్రమంలో అవతలి జంతువు కనిపించకుండా పారిపోతే తప్ప సింహం వదిలే ప్రసక్తి ఉండదు. అంతటి క్రూర మృగమైన సింహాన్ని ఓ నీటి ఏనుగు (hippopotamus) తరిమి కొట్టింది. తన పిల్లలతోపాటు నీటిలో ఉన్న నీటి ఏనుగు పరిధిలోకి ఓ సింహం వచ్చి నీరు తాగుతుంది. అది గమనించిన హిప్పోపొటామస్(hippopotamus)సింహం తనవైపు వస్తుందెమో అనుకుని..సింహం వైపు కోపంగా పరిగెడుతుంది. అది చూసిన సింహం వెనక్కి వెళుతుంది. అయినప్పటికీ సింహం ఓడ్డువైపుకు వెళ్లే దాకా వెనక్కి తరిమి మళ్లీ హుందాగా నీటి ఏనుగు వెనక్కి వస్తుంది.
ఈ దృశ్యాలను అటుగా వెళ్లిన ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కోడుతుంది. ఈ అరుదైన సంఘటన దక్షిణాఫ్రికా(south africa)లోని కపామా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ వీడియో(video) ఇన్ స్టా(instagram)లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 1.6 లక్షల వ్యూస్ రాగా..7,900 కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన పలువురు అనేక రకాలుగా కామెంట్లు(comments) చేస్తున్నారు. ఇప్పుడు అడవికి రాజు(king of forest) ఎవరు అని వ్యాఖ్యానిస్తున్నారు.
అడవిలో ఎన్ని జంతువులున్నా కూడా రారాజు మాత్రం సింహమేనని చెబుతుంటారు. ఆడసింహం దాదాపు గంటకు దాదాపు 80 కిలోమీటర్ల వేగం(80 kmph)తో పరిగెత్తి వేటాడగలదు. సింహాలు రోజుకు దాదాపు 20 గంటలు విశ్రాంతి(rest) తీసుకుంటాయి. రాత్రి సమయాల్లో ఎక్కువగా వేటకు వెళ్తాయి. ప్రధానంగా వీటి ఆహారం జింకలు, కంచర గాడిదలు, అడవి పందులు, అడవి దున్నలను ఎక్కువగా వేటాడతాయి. సింహాల నడక, ఆటిట్యూడ్ సహా పలు లక్షణాల కారణంగా సింహాన్ని మృగరాజుగా పిలుస్తారు.